మళ్లీ విడుదలకు సిద్దం అవుతున్న 'రెడ్‌' అక్కడైనా ఆకర్షించేనా?  

ram red movie going to kerala and north indian screens , kishore thirumala, nivetha pethuraj, ram hero, red movie, tollywood movie - Telugu Kishor Thirumala, Nivetha Pethuraj, Ram Hero, Red Movie, Tollywood Movie

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రెడ్‌‘ సినిమా నిరాశ పర్చింది.దర్శకుడు కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కు విమర్శకుల నుండి నెగటివ్‌ కామెంట్స్ వచ్చాయి.

TeluguStop.com - Ram Red Movie Going To Kerala And North Indian Screens

ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఎంజాయ్‌ చేయలేక పోయాం అంటున్నారు.బోరింగ్‌ గా ఉండటంతో పాటు చాలా రొటీన్ గా ఉండటం వల్ల సినిమా ఆధరణ కు నోచుకోవడం లేదు.

సినిమాలు ఏమీ లేకపోవడంతో పాటు చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా అవ్వడంతో వసూళ్లు ఒక మోస్తరుగా వస్తున్నాయి.కాని రెడ్‌ సినిమా సక్సెస్‌ అని మాత్రం అనిపించుకోవడం లేదు.

TeluguStop.com - మళ్లీ విడుదలకు సిద్దం అవుతున్న రెడ్‌’ అక్కడైనా ఆకర్షించేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయినా కూడా యూనిట్‌ సభ్యులు సక్సెస్ మీట్‌ లు ప్రెస్‌ మీట్‌ లు నిర్వహిస్తూ జనాల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ సమయంలోనే ఈ సినిమా మలయాళ వర్షన్‌ ను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రామ్‌ గతంలో నటించిన కొన్ని సినిమాలు కేరళలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.కనుక ఇప్పుడు ఈ సినిమాను కూడా మలయాళంలో విడుదల చేయాలని భావించారు.తెలుగు మరియు తమిళంలో ఒకే సారి సినిమాను విడుదల చేయాలని భావించారు.కాని కేరళలో థియేటర్ల ఇష్యూ ఉండటం వల్ల కాస్త ఆలస్యంగా విడుదల చేయబోతున్నారు.

ఈ వారంలోనే కేరళలో విడుదల చేయాలని నిర్ణయించారు.ఇప్పటికే డబ్బింగ్‌ పనులు పూర్తి అయ్యాయి.

అక్కడ ప్రమోషన్ కార్యక్రమం మొదలు అయ్యింది.ఇక హిందీలో కూడా రామ్‌ కు మంచి క్రేజ్‌ ఉంది.

పాత సినిమాలు యూట్యూబ్‌ ద్వారా వచ్చి ఘన విజయంను సాధించాయి.అందుకే రామ్‌ ఈ సినిమాను హిందీలో డబ్‌ చేసి విడుదల చేయాలనుకుంటున్నాడు.

ఫిబ్రవరి మొదటి వారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంట.తెలుగులో సక్సెస్ అవ్వని ఈ సినిమా అక్కడ సక్సెస్‌ అయ్యేనా అంటే చూడాలి.

#Ram Hero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు