'వారియర్' హిందీ డబ్బింగ్ రేట్స్ కు షాకింగ్ ధర!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ది వారియర్.ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకుని యాక్షన్ హీరోగా మారిపోయిన రామ్ ఇప్పుడు ఈ సినిమాతో కోలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతున్నాడు.

 Ram Pothineni's The Warrior Hindi Dubbing Rights Sold For A Whopping Record Pric-TeluguStop.com

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కూడా అది నిరాశ పరిచింది.

ఆ తర్వాత ఇప్పుడు లింగుస్వామితో సినిమా చేస్తున్నాడు రామ్.

ఈ సినిమాపై అటు కోలీవుడ్ ప్రేక్షకులు ఇటు టాలీవుడ్ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.మరొక ఇస్మార్ట్ శంకర్ అవుతుంది అని ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఈ సినిమాలో మొదటిసారి రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమాలో పోలీస్ పాత్ర కోసం రామ్ కండలు పెంచారని.

తెరపై సిక్స్ ప్యాక్ చూపించ బోతున్నాడని ప్రచారం జరుగుతుంది.

Telugu Hindi, Krithi Shetty, Lingusamy, Ram Pothineni, Sold, Warrior, Tollywood-

ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇటీవలే మరొక షెడ్యూల్ స్టార్ట్ చేసారు.ఇందులో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఇక తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది.

వారియర్ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ను 16 కోట్లకు అమ్ముడు పోయాయని తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.

Telugu Hindi, Krithi Shetty, Lingusamy, Ram Pothineni, Sold, Warrior, Tollywood-

దీంతో భారీ అంచనాలు పెరగడంతో ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టారు.ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు.మరి ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు ఇంకెన్ని రికార్డ్ లు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube