బెంచ్‌పై ఇరగదీసిన రెడ్ కుర్రాడు

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇటీవల ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టాడు.ఈ సినిమాతో ఫుల్ జోష్‌లోకి వచ్చిన రామ్ ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని రెడీ చేస్తున్నాడు.

 Ram Pothineni Special Dance On Bench In Red Movie-TeluguStop.com

‘రెడ్’ అనే టైటిల్‌తో తెరకెక్కతున్న ఈ సినిమాలో రామ్ డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్నాడు.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇండస్ట్రీలో తెగ్ హల్‌చల్ చేస్తోంది.

ఈ సినిమాలో రామ్ అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో వేసిన రైల్వే స్టేషన్ సెట్‌లో ఓ బెంచీపై రామ్ చేసే స్టెప్పులు సినిమాకే హైలైట్ కానున్నాయని చిత్ర యూనిట్ అంటోంది.

ఈ సినిమాతో మరోసారి రామ్ తనలోని డ్యాన్స్‌ర్‌ను బయటపెట్టడం కాయమని అంటున్నారు.ఇక యాక్షన్‌కు కొదువే లేని ఈ సినిమాలో రామ్ యాక్టింగ్ పీక్స్‌లో ఉంటుందని, ఈ సినిమాను ప్రేక్షకులు పూర్తిగా ఎంజాయ్ చేస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి మరోసారి రామ్ తనదైన డ్యాన్స్ స్టెప్పులతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్‌గా మాళవికా శర్మ, నివేదా పేతురాజ్‌లు నటిస్తున్నారు.

హెబ్బా పటేల్ ఓ స్పెషల్ సాంగ్‌లో రామ్‌తో చిందులు వేయనునంది.కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను స్రవంతి రవికిషోర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube