పొట్టుపొట్టు కొట్టించుకున్న రామ్.. చొక్కా విప్పి మరీ చూపించాడు!

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇటీవల నటించిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా నిలవడంతో రామ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.గతకొంత కాలంగా సరైన హిట్స్ లేక బాధపడుతున్న రామ్, ఈ సినిమా సక్సెస్‌తో ఫుల్ ఖుషీ చేసుకున్నాడు.

 Ram Pothineni Shows Off His Wounds-TeluguStop.com

ఇప్పుడు రామ్ తన నెక్ట్స్ మూవీ ‘రెడ్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రామ్‌ను పొట్టుపొట్టు కొట్టారని తన చొక్కా విప్పి మరీ చూపించాడు.

అసలు విషయం ఏమిటంటే, రెడ్ సినిమా షూటింగ్ సమయంలో ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ డైరెక్షన్‌లో యాక్షన్ స్టంట్స్ చేస్తున్న రామ్‌కు స్వల్ప గాయాలయ్యాయట.అయితే అవేమంత పెద్దవి కాదని, సినిమా షూటింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానంటూ రామ్ చెప్పుకొచ్చాడు.

ఇక తనకు తగిలిన గాయాలు నొప్పికంటే సంతోషాన్నే ఎక్కువగా ఇస్తున్నాయని చెప్పాడు.

దీనికి సంబంధించిన వీడియోను రామ్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియోను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నాడు.కాగా రెడ్ సినిమాలో రామ్ డ్యుయెల్ రోల్ చేస్తుండగా ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్నట్లు ఆయన తెలిపారు.

కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube