ఓటీటీ ఆఫర్స్‌కు రెడ్ సిగ్నల్ వేస్తోన్న హీరో  

Ram Pothineni Rejects OTT Offers, Ram Pothineni, OTT, Red Movie, Kishore Tirumala, Tollywood News - Telugu @ramsayz, Kishore Tirumala, Ott, Ram Pothineni, Red Movie, Tollywood News

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెడ్ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.అయితే రామ్ ఈ సినిమాతో మరోసారి ఇస్మార్ట్ శంకర్ లాంటి సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

TeluguStop.com - Ram Pothineni Rejects Ott Offers

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇక ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఈ సినిమాను పూర్తి థ్రిల్లర్ మూవీగా దర్శకుడు తెరకెక్కిస్తుండటంతో, ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

TeluguStop.com - ఓటీటీ ఆఫర్స్‌కు రెడ్ సిగ్నల్ వేస్తోన్న హీరో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమాలో రామ్ సరికొత్త అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

రెడ్ అనే టైటిల్‌తో తెరకెక్కతున్న ఈ సినిమాలో రామ్ డ్యుయెల్ రోల్‌లో నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి.

కాగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవ్వగా, లాక్‌డౌన్ కారణంగా అది వాయిదా పడింది.ఇక ఇప్పట్లో థియేటర్లు తెరుచుకుంటాయో లేదో అనే పరిస్థితి నెలకొనడంతో ఈ సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.

ఇక ఈ క్రమంలో రెడ్ చిత్రానికి పలు ఓటీటీల నుండి మంచి ఆఫర్లు కూడా వచ్చి పడుతున్నాయి.దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు.

అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే ప్రసక్తే లేదని చిత్ర యూనిట్ అంటోంది.ఇక రామ్ పోతినేని కూడా ఈ సినిమాను ఎలాగైనా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.

ఈ క్రమంలో తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ నుండి రెడ్ చిత్రానికి భారీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.కానీ ఈ ఆఫర్‌ను రామ్ తిరస్కరించాడని, ఈ సినిమాను ఎలాగైనా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్‌కు సూచించినట్లు తెలుస్తోంది.

ఇలా ఓటీటీ ఆఫర్లకు రెడ్ సిగ్నల్ వేస్తూ వస్తున్న రామ్, ఈ సినిమా థియేటర్లలో పక్కా హిట్ కొడుతుందని పూర్తి ధీమాగా ఉన్నాడట.మరి రామ్ నమ్మకం ఎంతమేర‌కు నెరవేరుతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

#@ramsayz #Ram Pothineni

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Pothineni Rejects Ott Offers Related Telugu News,Photos/Pics,Images..