రెడ్ మూవీ రివ్యూ & రేటింగ్  

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘రెడ్’ ఎప్పుడో షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.అయితే కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

TeluguStop.com - Ram Pothineni Red Movie Review And Rating

ఇక సంక్రాంతి కానుకగా నేడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రామ్ పోతినేని డ్యుయెల్ రోల్‌లో చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ:

సిద్ధార్థ్-ఆదిత్య(రామ్ పోతినేని) ఒకేలా ఉన్న కవలలు.అయితే సిద్ధార్థ్ చాలా పద్ధతిగా పెరిగి సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తుంటాడు.

TeluguStop.com - రెడ్ మూవీ రివ్యూ & రేటింగ్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఆదిత్య మాత్రం ఆవారాగా తిరుగుతూ నిత్యం ఏదో ఒక గొడవలో ఉంటాడు.కట్ చేస్తే.

ఓ యువకుడి హత్య కేసులో పోలీసు ఇన్‌స్పెక్టర్స్ యామిని(నివేథా పేతురాజ్) అండ్ టీమ్ సిద్ధార్థ్‌ను అరెస్ట్ చేస్తారు.అతడు ఎందుకు హత్య చేశాడా అనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తుంటారు.

అయితే ఈ హత్య తానే చేశానంటూ ఆదిత్య పోలీసులకు లొంగిపోతాడు.ఇంతకీ ఈ హత్య ఎవరు చేశారు? ఈ హత్యకు సిద్ధార్థ్‌కు ఎలాంటి లింక్ ఉంది? మరి ఆదిత్య ఎందుకు లొంగిపోయాడు? అనేది సినిమా కథ.

విశ్లేషణ:

యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్న రామ్ పోతినేని డ్యుయెల్ రోల్‌లో సినిమా చేస్తున్నాడనగానే ‘రెడ్’ చిత్రంపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

కాగా డ్యుయెల్ రోల్స్ చేయడం అంత ఈజీ కాదనే విషయాన్ని మనకు రామ్ ఈ సినిమాలో నిరూపించాడు.రెండు విభిన్న పాత్రల్లో తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు.

అటు హత్య కేసులో ఒకరు అరెస్ట్ అయితే, మరొక హీరోగా రామ్ యాక్టింగ్ ఈ సినిమాలో కీలకం అని చెప్పాలి.

ఇద్దరు హీరోల క్యారెక్టర్లు పరిచయం చేయడం, వారికి సంబంధించి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌తో పాటు హీరోయిన్లకు సంబంధించిన కథనాన్ని ఫస్టాఫ్‌లో చూపించాడు దర్శకుడు కిషోర్ తిరుమల.

అయితే ఓ హత్య కేసులో ఒక హీరో అరెస్ట్ కావడంతో, మరొక హీరో కూడా లొంగిపోవడంతో ఈ సినిమా కథ సస్పెన్స్‌గా మారుతుంది.ఈ ఇద్దరిలో హత్య ఎవరు చేశారనే అంశాన్ని పోలీసులు కనిపెట్టేందుకు చేసే ప్రయత్నాలు మనకు ఫస్టాఫ్‌లో కనిపిస్తాయి.

అయితే ఈ హత్య వెనుక ఉన్న అసలు కథ, హంతకులు, వారికి హీరోలకు ఎలాంటి సంబంధం ఉందా అనే అంశాలను దర్శకుడు సెకండాఫ్‌లో రివీల్ చేశాడు.ఇక రెండో హీరో ఎందుకు తానంతట తానే లొంగిపోయాడా అనే అంశాన్ని కూడా సెకండాఫ్‌లో మనకు చూపించారు.ఒక చక్కటి ఎండింగ్‌తో ఈ సినిమా కథను ముగించడంతో దర్శకుడు కిషోర్ తిరుమల ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశాడని ప్రేక్షకులు భావించారు.

నటీనటుల పర్ఫార్మెన్స్:

రెడ్ చిత్రాన్ని హీరో రామ్ తన భుజాలపై మోశాడని చెప్పాలి.ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో ఎక్కవ స్పేస్‌ను తానే కబ్జా చేశాడు.ఆయన రెండు పాత్రల్లో వేరియేషన్లు చూపించడంలో చాలా వరకు సక్సె్స్ అయ్యాడని చెప్పాలి.

ఇక హీరోయిన్లుగా నివేథా పేతురాజ్, మాళవికా శర్మ, అమృత అయ్యర్‌లు తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.కాగా మిగతా నటీనటులు ఈ సినిమాలో వారికి కేటాయించిన పాత్రల్లో ఒదిగిపోయారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:

దర్శకుడు కిషోర్ తిరుమల రెడ్ చిత్రాన్ని ముందుండి నడిపించాడని చెప్పాలి.తాను రాసుకున్న కథకు ఎక్కడా లోటు రాకుండా అన్ని అంశాలను చక్కగా ప్రెజెంట్ చేయడంలో కిషోర్ సక్సెస్ అయ్యాడు.

ఇక సినిమాలో సస్పెన్స్ అంశాలను చివరి వరకు క్యారీ చేయడంలో ఆయన పాస్ అయ్యాడు.అటు మణిశర్మ సంగీతం ఈ సినిమాకు మేజర్ అసెట్ అని చెప్పాలి.

ముఖ్యంగా బీజీఎంలో మణిశర్మ తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు.కాగా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పనులు చక్కగా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు ఎక్కడా బోరింగ్ అనిపించదు.

చివరగా:

రెడ్ – చివరి వరకూ ఆకట్టుకునే థ్రిల్లర్ మూవీ!

రేటింగ్:3.0/5.0

#Ram Pothineni

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు