పెళ్లి ఊసే ఎత్తని రాముడు.. ఏమై ఉంటుంది తమ్ముడు?  

Ram Pothineni Not Interested In Marriage - Telugu Marriage, Ram Pothineni, Red Movie, Telugu Movie News

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవల క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాలో నటించిన అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నాడు.ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తన నెక్ట్స్ మూవీ ‘రెడ్’ను కూడా ఇప్పటికే జెట్ స్పీడులో పూర్తి చేస్తున్నాడు ఈ హీరో.

Ram Pothineni Not Interested In Marriage

అయితే తాజాగా రామ్ తన సోదరుడి కొడుకుతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

‘తమ కుటుంబానికి వారసుడొచ్చాడు’ అంటూ రామ్ పెట్టిన పోస్ట్‌ తెగ హల్‌చల్ చేస్తోంది.

పెళ్లి ఊసే ఎత్తని రాముడు.. ఏమై ఉంటుంది తమ్ముడు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ పోస్ట్‌తో ఆయన అభిమానులు రామ్‌ను చాలా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.వారసుడి సరేగాని రామ్ పెళ్లి మాటేమిటి అంటూ వారు ప్రశ్నలు కురిపించారు.

అయితే పెళ్లి విషయంలో రామ్ ఇంకా ఒక క్లారిటీకి రాలేదని అతడి సన్నిహితులు అంటున్నారు.

ఇప్పట్లో రామ్ పెళ్లి చేసుకోడు అనే సంకేతాలను వారు అందిస్తుండటంతో, రామ్ అసలు పెళ్లే చేసుకోడా అనే సందేహం అందరిలో మెదులుతోంది.

ఇంతకీ పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణమేమిటి? అంటూ పలువురు రామ్‌ను ప్రశ్నిస్తున్నారు.మరి వారి ప్రశ్నలకు రామ్ ఎలా సమాధానం ఇస్తాడో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Pothineni Not Interested In Marriage Related Telugu News,Photos/Pics,Images..

footer-test