త్రివిక్రమ్ దెబ్బకు తమిళ బాట పట్టిన రామ్

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ రెడ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో అదిరిపోయే సక్సె్స్ కొట్టాలని రామ్ ఆశించాడు.

 Ram Pothineni Next Movie With Tamil Director, Ram Pothineni, Trivikram, Red Movi-TeluguStop.com

కానీ ఈ సినిమా రిలీజ్ రోజునే మిక్సిడ్ టాక్ తెచ్చుకోవడంతో, ప్రస్తుతం ఫ్లాప్ దిశగా ఈ సినిమా వెళ్తోంది.ఇక రెడ్ చిత్రం తరువాత రామ్ ఎవరితో సినిమా చేస్తాడా అనే అంశం ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉండిపోయింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రామ్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించనున్నట్లు గతంలో వెల్లడించాడు.అయితే ఈ సినిమా ఇప్పుడప్పుడే పట్టాలెక్కే అవకాశం లేనట్లుగా కనిపిస్తుంది.ఇప్పటికే త్రివిక్రమ్ తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ 30వ చిత్రంగా రానున్న ఈ సినిమా కోసం త్రివిక్రమ్ చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాడు.

ఇప్పటికే స్క్రిప్టుకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానున్నట్లు త్రివిక్రమ్ అంటున్నాడు.దీంతో రామ్‌తో త్రివిక్రమ్ చిత్రం పరిస్థితి ఏమిటా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే త్రివిక్రమ్ ఇప్పట్లో రామ్‌తో సినిమా చేయకపోవడంతో, రామ్ తన నెక్ట్స్ చిత్రం కోసం వేరే డైరెక్టర్లకు అవకాశం ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలో ఓ తమిళ దర్శకుడు చెప్పిన కథ రామ్‌కు నచ్చడంతో స్క్రిప్టును పూర్తిగా డెవలెప్ చేయాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఈ స్క్రిప్టు రామ్‌కు పూర్తిగా నచ్చితే, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉండబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.మరి రామ్‌కు కథను రెడీ చేస్తు్న్న ఆ తమిళ డైరెక్టర్ ఎవరో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube