'రాపో19' కోసం లొకేషన్స్ వేటలో మేకర్స్.. వీడియో వైరల్!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనేర్జిటిక్ హీరోల్లో రామ్ పోతినేని ఒకరు.ఎప్పుడు చాకోలెట్ బాయ్ లాగా ఉండే రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన లుక్ మొత్తం మార్చేశాడు.

 Ram Pothineni Lingusamy Movie Latest Update-TeluguStop.com

పూరీ టేకింగ్ లో రామ్ మొత్తం మారిపోయి మాస్ హీరో అయి పోయాడు.ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవవడంతో రామ్ ఇప్పుడు అన్ని యాక్షన్ సినిమాలను ఎంచుకుంటూ మాస్ ఇమేజ్ ను కాపాడుకోవాలని ట్రై చేస్తున్నాడు.

ప్రస్తుతం రామ్ కోలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ తో ఒక సినిమా కమిటయ్యారు.పక్కా మాస్ సినిమాలను తెరకెక్కించే లింగుస్వామి తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

 Ram Pothineni Lingusamy Movie Latest Update-రాపో19’ కోసం లొకేషన్స్ వేటలో మేకర్స్.. వీడియో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లోను బాగా అంచనాలు పెరిగాయి.లింగుస్వామి తన హీరోలను ఒక రేంజ్ లో చూపిస్తాడు.

అందుకే రామ్ ను ఎలా చూపిస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.ప్రెసెంట్ ఈ సినిమాను రాపో19 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను తెలుగు, తమిళ్ రెండు భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి నటిస్తుండగా.ఆది పినిశెట్టి, అక్షర గౌడ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా నుండి మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను ప్రకటించారు.

ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ అవ్వబోతున్న నేపథ్యంలో అందుకోసం లొకేషన్స్ వెతుకుతున్నట్టు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.అందుకు సంబంధించిన వీడియో కూడా షేర్ చేసారు.ఈ వీడియోలో మేకర్స్ లొకేషన్స్ గురించి మాట్లాడు కుంటున్నారు.

ప్రెసెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.అందమైన లొకేషన్స్ దొరకగానే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చెయ్యబోతున్నారు.

#Schedule #Ram Pothineni #Lingusamy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు