టీజర్ టాక్ : ది వారియర్‌ చాలా తేడా పోలీస్ బాసూ

రామ్‌ హీరోగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా తమిళ మాస్‌ డైరెక్టర్‌ లింగు స్వామి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ది వారియర్‌.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా టీజర్ ను రామ్‌ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేశారు.

 Ram Pothineni, Krithi Shetty The Warriorr Teaser  Ram Pothineni, Krithi Shetty ,-TeluguStop.com

ఈ సినిమా ను జులై నెలలో విడుదల చేయబోతున్నవిషయం తెల్సిందే.టీజర్‌ విడుదల తో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.

ముందుగానే ఈ సినిమా లో రామ్‌ ను పోలీస్ గా చూపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.టీజర్‌ లో ఆ విషయాన్ని మరింత స్పష్టంగా క్లీయర్‌ చేశారు.

రామ్‌ పాత్రను అత్యంత మాస్ గా ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే విధంగా రూపొందించినట్లుగా ఈ టీజర్ చూస్తుంటే అనిపిస్తుంది.

తప్పకుండా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే తెలుగు లో చాలా పోలీస్ స్టోరీస్ వచ్చాయి.కాని ఈ సినిమా అందుకు చాలా ప్రత్యేకమైన సినిమా గా ఉంటుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తూ ఉంటే.

లింగు స్వామి ఎంత మేరకు స్పెషల్‌ గా రామ్ పాత్రను డిజైన్ చేసి ఉంటాడు అనేది తెలియాల్సి ఉంది.పెద్ద ఎత్తున అంచనాలున్న ది వారియర్ సినిమా టీజర్ విడుదల అయిన తర్వాత సినిమా స్థాయి మరింతగా పెరిగింది.

ఉప్పెన బ్యూటీ బేబమ్మ కృతి శెట్టి చాలా క్యూట్‌ గా కనిపించడం తో పాటు రామ్‌ కు సరి జోడీ అన్నట్లుగా ఉంది.ఇక ఆది పినిశెట్టి విలనిజంతో కుమ్మేయడం ఖాయం గా ఉంది.

ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.సినిమాను జులై 14వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

రామ్‌ కు ఇది మంచి విజయాన్న ఇస్తుందా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube