స్వర్ణ ప్యాలెస్ ఘటన పై సీఎం జగన్ కు చురకలు అంటించిన రామ్ పోతినేని

ఇటీవల విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లోని కోవిడ్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం విదితమే.ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా పలువురు గాయాలతో బయటపడగలిగారు.

 Hero Ram Tweet About Swarna Palace Incident, Vijayawada, Ram Pothineni, Jagan, S-TeluguStop.com

విజయవాడ లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది.తాజాగా ఈ ఘటన పై టాలీవుడ్ హీరో రామ్ పోతినేని స్పందించారు.

వెనకాల ఎదో పెద్ద కుట్ర జరుగుతోంది అంటూ ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి రామ్ ట్వీట్ చేశాడు.హోటల్ స్వర్ణ ప్యాలస్‌ని రమేశ్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్‌గా మార్చక ముందు, ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది.

అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉండి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు? అంటూ రామ్ నేరుగా ప్రశ్నించారు.అంతేకాకుండా రామ్ మరో ట్వీట్ చేశాడు.

ఫైర్ + ఫీజు ‌= ఫూల్స్ అంటూ అంద‌రినీ ఫూల్స్ చేయ‌డానికే విష‌యాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మ‌ళ్లిస్తున్నారా? అని అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.మేనేజ్‌మెంట్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్న స్వ‌ర్ణ‌ప్యాలెస్‌ డైరెక్ట్‌గా బిల్లింగ్ చేసిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

దీనివెనక పెద్ద కుట్ర జ‌రుగుతున్న‌ట్టుందని అనుమానం వ్యక్తం చేశారు.

Telugu Jagan, Ram Pothineni, Ramesh, Swarna Palace, Vijayawada-General-Telugu

సీఎంని త‌ప్పుగా చూపించ‌డానికి ‘‘మీ కింద ప‌ని‌చేసే కొంత‌మంది మీకు తెలియ‌కుండా చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల మీ రెప్యుటేష‌న్‌కీ‌, మీ మీద మేం పెట్టుకున్న న‌మ్మ‌కానికి డ్యామేజ్ కలుగుతోంది అని,వాళ్ల మీద ఓ లుక్కేస్తార‌ని ఆశిస్తున్నాం” అంటూ ట్వీట్ చేస్తూ విజ్ఞప్తి చేశాడు.ఇటీవల విజయవాడలో చోటుచేసుకున్న స్వర్ణ ప్యాలెస్ ఘటన సంచలనం రేపిన విషయం సంగతి తెలిసిందే.ఈ ఘటనలో రమేష్ హాస్పటల్ చైర్మన్ డాక్టర్ రమేష్ కనిపించకుండా పోవడం తో ఈ అంశం మరింత ఆసక్తికరంగా మారింది.

ఈ ఘటన తో ఏపీ సర్కార్ రమేష్ హాస్పటల్ లైసెన్స్ ను కూడా తాజాగా రద్దు చేసింది కూడా.ఇంకా ఈ ఘటనపై పూర్తి స్తాయిలో విచారణ జరుగుతూనే ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube