ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని( Ram Pothineni ) ఇష్మార్ట్ శంకర్, ది వారియర్ వంటి యాక్షన్ సినిమాలతో అలరించాడు.ఇక ఇప్పుడు అసలు సిసలైన యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.
ఈ ఇద్దరి కాంబోపై భారీ అంచనాలు పెరిగాయి.రామ్ కథానాయకుడిగా శ్రీలీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను (Boyapati Srinu)దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ”RAPO20”.
ఈ సినిమా కూడా పాన్ ఇండియా బరిలో ఉంది.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.
దాదాపు చాలా భాగం షూటింగ్ పూర్తి చేసారు.ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి పాన్ ఇండియా రేసులో నిలవాలని రామ్ ఆరాట పడుతున్నాడు.
ఇక ఈ సినిమాను అక్టోబర్ 20న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా మే 15న రామ్ పోతినేని పుట్టిన రోజు.మరి ఆ రోజు అదిరిపోయే ట్రీట్ ఫ్యాన్స్ కు ఇవ్వబోతున్నట్టు సమాచారం.ఒకటి కాదు ఏకంగా డబుల్ ధమాకాను ప్లాన్ చేస్తున్నారట.ప్రస్తుతం రామ్ చేస్తున్న ఈ సినిమా నుండి ఒక సర్ప్రైజ్ రాబోతుందట.అలాగే రామ్ నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ కూడా అదే రోజు రాబోతున్నట్టు తెలుస్తుంది.

రామ్ నెక్స్ట్ పూరీతో (Puri Jagannadh) చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే ఈ కాంబోలో ఇష్మార్ట్ శంకర్ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.అందుకే మరో సినిమా అనడంతో అంచనాలు పెరుగు తున్నాయి.
బర్త్ డే (Ram’s birthday) రోజు రామ్ ఇచ్చే సర్ప్రైజ్ ల కోసం ఫ్యాన్స్ ఇప్పటి నుండే ఎదురు చూస్తున్నారు.మరి ఈ కాంబో మరోసారి ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.
