హెబ్బాతో అబ్బా అనిపించిన రామ్ ‘డింఛక్’

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెడ్’ రిలీజ్‌కు రెడీ అయ్యింది.‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో, అదే జోష్‌తో రెడ్ అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు.

 Ram Dinchak Song Teaser Released, Ram Pothineni, Dinchak Song Teaser, Hebah Pate-TeluguStop.com

ఈ సినిమాలో తొలిసారి డ్యుయెల్ రోల్ చేస్తున్న రామ్, మరోసారి సక్సెస్ అందుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.ఇక కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పోస్టర్స్, టీజర్లతో ఇప్పటికే మంచి అంచనాలు క్రియేట్ చేశాడు రామ్.

కాగా మే 15న పుట్టినరోజు జరుపుకుంటున్న రామ్, తన బర్త్‌డే గిఫ్ట్‌గా రెడ్ చిత్రంలోని మాస్ సాంగ్ ‘డింఛక్’కు సంబంధించిన ఓ గ్లింప్స్‌ను తాజాగా వదిలాడు.ఈ పాటలో అందాల భామ హెబ్బా పటేల్‌తో కలిసి రామ్ చేసే రచ్చ ఓ రేంజ్‌లో ఉంది.

రామ్‌ను ఎనర్జిటిక్ స్టార్ అని ఎందుకు అంటారో ఈ సాంగ్ టీజర్ చూస్తే అర్థమవుతుంది.మణిశర్మ అందించిన ఈ మాస్ నెంబర్‌కు రామ్ డ్యాన్స్ హైలైట్‌గా నిలవనుంది.

ఇక ఈ సాంగ్ టీజర్ చూసి మాస్ ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు.టీజర్‌లోనే ఇంత మ్యాటర్ ఉంటే, సాంగ్‌లో ఇంకెంతుందో అని వారు అనుకుంటున్నారు.

మొత్తానికి రామ్ మరోసారి మాస్ ప్రేక్షకులను తనదైన డ్యాన్స్‌తో ఆకట్టుకునేందుకు రెడ్ చిత్రంతో రెడీ అయ్యాడని చెప్పొచ్చు.ఈ సినిమాలో రామ్ యాక్టింగ్ కూడా ఓ రేంజ్‌లో ఉంటుందని తెలుస్తోంది.

నివేధా పేతురాజ్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను స్రవంతి రవికిషోర్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.లాక్‌డౌన్ తరువాత ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

మరి రెడ్ సినిమాతో రామ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube