ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పిన రామ్  

ఇస్మార్ట్ శంకర్ సినిమా చేయడానికి జగడం కారణం అన్న రామ్. .

Ram Open Up About Ismart Shankar Movie Role-ismart Shankar Movie Role,puri Jagannath,ram Open Up,telugu Cinema,tollywood

ఎనర్జిటిక్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరో రామ్. అయితే రామ్ కెరియర్ పరంగా చూసుకుంటే ఇప్పటి వరకు రెడీ, కందిరీగ, నేను శైలజ సినిమాలు తప్ప గుర్తుంచుకోదగ్గ సినిమాలు పెద్దగా లేవని చెప్పాలి. అయితే రామ్ కెరీర్లో జగడం సినిమా తప్ప ఇప్పటి వరకు చేసిన అన్ని లవర్ బాయ్ తరహా పాత్రలే..

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పిన రామ్-Ram Open Up About Ismart Shankar Movie Role

ఈ పాత్రల వల్ల రామ్ తనలోని పూర్తిస్థాయి నటుడుని ఎప్పుడు కూడా ప్రేక్షకులకు పరిచయం చేయలేకపోయాడు. దీంతో తనలో మరో యాంగిల్ ని చూపించాలనే ప్రయత్నంలో పూరి దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేశాడనే విషయం తాజాగా చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని రామ్ స్పష్టం చేశాడు.

దర్శకుడు పూరి సినిమాలంటే హీరో పాత్రలు చాలా వరకు నెగిటివ్ యాంగిల్ లో ఉంటాయి. అలాగే ఈ సినిమాలో కూడా హీరో పాత్ర అ పూర్తి నెగటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నట్లు చెప్పాడు. ఇక ఈ పాత్రను ఎంచుకోవడానికి గల కారణాలు కూడా రామ్ తెలియజేశాడు.

ఇప్పటి వరకు తను చాలా సాఫ్ట్ పాత్రలు చేశాను అని, ఆ పాత్రలతో తనకు పెద్దగా కిక్కు లేదని, తన పాత్రలో మంచితనం ఎక్కువైపోయింది అనే ఫీలింగ్ నాతో పాటు చాలామంది తన ఫ్రెండ్స్ చెప్పడంతో జగడం లాంటి సినిమాని చేయాలని ఫిక్స్ అయినట్లు చెప్పాడు. అదే సమయంలో అలాంటి మైండ్ సెట్ తో ఉన్న కథనే పూరి జగన్నాధ్ తనకు చెప్పడం జరిగిందని, అందుకే వెంటనే ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ఓకే చెప్పినట్లు రామ్ చెప్పుకొచ్చాడు. మరి ఇన్ని హోప్స్ తో రామ్ నటించిన సినిమా మా ప్రేక్షకులను ఎంత వరకు నేర్పిస్తుంది అనేది వేచి చూడాల్సిందే.