పాత సినిమాకు బూజు దులుపుతున్న రామ్

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెడ్’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఇస్మార్ట్ శంకర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తరువాత రామ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

 Ram Next Movie With Praveen Sattaru Back In Talks-TeluguStop.com

ఇక కిషోర్ తిరుమల వంటి సక్సె్స్‌ఫుల్ డైరెక్టర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ మొదలుకొని, సాంగ్స్, టీజర్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.

ఇక ఈ సినిమా తరువాత రామ్ ఎవరితో సినిమా చేస్తాడా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.కాగా రామ్ గతంలో ఓ డైరెక్టర్‌తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

 Ram Next Movie With Praveen Sattaru Back In Talks-పాత సినిమాకు బూజు దులుపుతున్న రామ్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఆ సినిమా కథలో చాలా మార్పులు కావాలని రామ్ చెప్పడంతో ఈ సినిమా అటకెక్కింది.అయితే ఇప్పుడు మరోసారి ఈ సినిమాకు సంబంధించిన వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

గరుడవేగ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ మూవీని అందించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, రామ్‌తో సినిమా చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాడని, అందుకే ఆ సినిమా కథలో చాలా మార్పులు చేసి స్క్రిప్టును ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది.

రామ్‌కు ఇప్పుడు ఈ కథ బాగా నచ్చడంతో వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాతో రామ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇక రామ్ నటిస్తున్న రెడ్ చిత్రాన్ని వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.

ఈ సినిమాలో రామ్ సరసన నివేథా పేతురాజ్, మాళవికా శర్మ, అమృత అయ్యర్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

#Ram Pothineni #Praveen Sattaru

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు