రామ్ చరణ్ నన్ను కొట్టి సారీ చెప్పారు.. రామ్ హీరో సూర్య కామెంట్స్ వైరల్!

జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రామ్( Ram  Movie ) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే .ఈ సినిమా ద్వారా సూర్య (Suriya ) అయ్యాల సోమయాజులు హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.

 Rapid Action Mission Ram Movie Hero Surya Ayyalasomayajula Comments About Ram Ch-TeluguStop.com

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఈ ప్రమోషన్లలో భాగంగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని హీరో రామ్ చరణ్ ( Ram charan) నటించినటువంటి గేమ్ చేంజర్ ( Game Changer ) సినిమా గురించి కొన్ని విషయాలను వెల్లడించారు.

తాను ఈ సినిమాలో కూడా నటించారని హీరో నవీన్ చంద్ర బ్యాచ్ లో తను కూడా కనిపిస్తాను అంటూ ఈయన వెల్లడించారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను సూర్య గుర్తు చేసుకున్నారు.ఈ సినిమాలో ఓ యాక్షన్ సన్నివేశంలో నటించే సమయంలో రామ్ చరణ్ తనని కొడుతూ సారీ చెప్పేవారు అంటూ ఈయన తెలిపారు.ఒక యాక్షన్ సీక్వెన్స్( Action Scenes ) లో భాగంగా రామ్ చరణ్ కొడితే మేము గాలిలోకి బౌన్స్ అవ్వాలి.

ఆ సీన్ చేయడానికి సుమారు 10 టేక్ లు తీసుకున్నాము.

ఇలా రామ్ చరణ్ గారు పది సార్లు నన్ను కొట్టి నాకు సారీ చెప్పారు.కొట్టిన ప్రతిసారి వచ్చి సారీ చెప్పేవారు.తాను అమృత్ సర్ షెడ్యూల్‌లో  ఓ పదిహేను రోజులు వర్క్ చేసినట్టుగా చెప్పుకొచ్చాడు.

ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ  రామ్ చరణ్ ఎంతో హంబుల్ పర్సన్ అంటూ సూర్య చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇక గేమ్ చేంజర్ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube