రామాలయం కోసం ఊర్మిళ ప్రతిజ్ఞ… 28 ఏళ్లుగా భోజనానికి దూరం  

Jabalpur women did not had food from 28 years for ram mandir, Ayodhya, Hinduism, BJP, PM Modi - Telugu Ayodhya, Bjp, Hinduism, Jabalpur Women Did Not Had Food From 28 Years For Ram Mandir, Pm Modi

దశాబ్దాలుగా హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఆధిపత్య పోరుకి కారణంఅయినా అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం వచ్చింది.ఎన్నో ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణం అయ్యి దశాబ్దాలుగా సుప్రీం కోర్టులో ఉన్న ఈ వివాదాస్పద రామజన్మభూమి ఇష్యూని సుప్రీం శుభం కార్డు వేసి రామాలయ నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

 Ram Mandir Ayodhya Hinduism Bjp Pm Modi Urmila

ఆ రామజన్మభూమికి సమీపంలో ఐదు ఎకరాల స్థలం మసీదు నిర్మాణంకి కేటాయించింది.ఇక యూపీలోని యోగీ సర్కార్ రామాలయ నిర్మాణానికి రంగం సిద్ధం చేశారు.

ఆగష్టు 5న భూమిపూజకి ముహూర్తం పెట్టారు.ఇక ఎంతో మంది హిందువుల కలగా ఉన్న రామాలయ నిర్మాణానికి మొత్తానికి శిలాఫలకం పడబోతోంది.

రామాలయం కోసం ఊర్మిళ ప్రతిజ్ఞ… 28 ఏళ్లుగా భోజనానికి దూరం-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే అయోధ్య‌లో రామాలయ నిర్మాణం కోసం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌న‌కు చెందిన ఒక మ‌హిళ చేప‌ట్టిన దీక్ష సఫలమైంది.28 సంవత్సరాల క్రితం రామాల‌య నిర్మాణం విష‌యంలో, వివాదం త‌లెత్తిన నేప‌ధ్యంలో ఆమె తాను రామాల‌య నిర్మాణం ప్రారంభమయ్యే వరకు అన్నం ముట్ట‌న‌ని ప్రతిజ్ఞ చేసింది.ఆమె పేరు ఊర్మిళ చతుర్వేది. 1992లో అయోధ్యలో అల్ల‌ర్లు చెల‌రేగిన స‌మ‌యంలో ఆమె వయసు 53 సంవత్సరాలు.ఆ ఘ‌ట‌న‌తో తీవ్రంగా క‌ల‌త చెందిన ఆమె అయోధ్యలో రామాల‌య నిర్మాణం జ‌రిగేవ‌ర‌కూ అన్నం తినను అని భీష్మ ప్రతిజ్ఞ చేసింది.ప‌లుమార్లు కుటుంబ స‌భ్యులు ఆమెను అన్నం తిన‌మ‌ని బ‌తిమాలిన‌ప్ప‌టికీ, ఆమె వారి మాట విన‌లేదు.

పండ్లు మాత్ర‌మే తింటూ, ఇంట్లో రామ‌ద‌ర్బార్ ఏర్పాటు చేసుకుని, రామ‌నామ జపం చేసుకుంటూ కాలం గడుపుతుంది.ఆగ‌స్టు 5న అయోధ్య‌లో జ‌రిగే ఆల‌య నిర్మాణ భూమి పూజ‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో చూసిన అనంత‌రం త‌న దీక్ష‌ను విర‌మిస్తాన‌ని ఊర్మిళ పేర్కొంది.

#Hinduism #Bjp #PM Modi #Ayodhya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jabalpur Women Did Not Had Food From 28 Years For Ram Mandir Related Telugu News,Photos/Pics,Images..