అమెరికాలో అయోధ్య భూమి పూజ సంబరాలు  

Ayodhya, America, Bhumi puja, Ayodhya bhumi pooja celebrations america - Telugu America, Ayodhya, Ayodhya Bhumi Pooja Celebrations America, Bhumi Puja

దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.రేపు అయోద్యలో రామ మందిరం నిర్మాణంకు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భూమి పూజ జరుగబోతుంది.

 Ram Mandir Ayodhya Celebrations America

దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండో హిందువులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.రేపటి కార్యక్రమంను కోట్లాది మంది లైవ్‌ టీవీ షోల్లో చూసేందుకు రెడీ అయ్యారు.

ఇదే సమయంలో దేశంలోని హిందువులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భూమి పూజ సమయంలో ప్రతి దేవాలయంలో కూడా గంటలు మ్రోగించాలని భావిస్తున్నారు.ఇప్పటికే హిందూ సమాజం కార్యకర్తలకు ఈ సమాచారం వెళ్లింది.

అమెరికాలో అయోధ్య భూమి పూజ సంబరాలు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక అమెరికాలో కూడా హడావుడి పెద్ద ఎత్తున కనిపిస్తుంది.

ఇప్పటికే అమెరికా వీధుల్లో రాముడి చిత్ర పటాలు మరియు ఎల్‌ఈడీ స్క్రీన్స్‌లో అయోద్య రామాలయంకు సంబంధించిన చిత్రాలు ప్రదర్శిస్తున్నారు.

ఇండో అమెరికన్‌ హిందూ సమాజం నాయకులు అమెరికాలోని ముఖ్య ప్రదేశాల్లో వర్చువల్‌ ప్రార్థనలు నిర్వహించేందుకు గాను భారీ స్క్రీన్స్‌ను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు.న్యూయార్క్‌ లోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వెర్‌ వద్ద కూడా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లో రాముడి త్రీడీ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు.

వైట్‌ హౌస్‌ వద్ద కూడా రాముడి ఫొటోలు ప్రదర్శిస్తూ ఉన్నారు.భూమి పూజ సమయంలో అమెరికాలోని దేవాలయాల్లో కూడా పూజలు నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు.కోట్లాది మంది హిందువుల అభిమతంకు ప్రతీక అయిన రామాలయం భూమి పూజ కనుక ప్రతి ఒక్క హిందువు ఈ వేడుకలో పాల్గొనాలంటూ స్వామీజీలు పిలుపునిస్తున్నారు.

#AyodhyaBhumi #America #Bhumi Puja #Ayodhya

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Mandir Ayodhya Celebrations America Related Telugu News,Photos/Pics,Images..