మోడీ కి షాక్ ఇచ్చిన కీలక నేత..బీజేపి కి గుడ్ బై

ఎన్నికలు ఎంతో దూరంలో లేవు.కేంద్రంలో బలమైన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ బీజేపి లు ఎవరి వ్యూహాలతో దూసుకుపోతున్నారు.

 Ram Madhav Team Member Shivam Shankar Singh Resigned To Bjp-TeluguStop.com

పార్టీల లోకి రావాలన్నా…రాజకీయ నేతలు పార్టీ గోడలు దూకాలంటే ఇదే సరైన సమయం కూడా.అయితే గడిచిన నాలుగేళ్ళుగా ఏక చత్రాదిపత్యం గా ఏలిన మోడీ కి ఎన్నికల సమయంలో కోలుకోలేని దెబ్బలు తగుతుతూనే ఉన్నాయి.

మోడీ షా ల నియంతృత్వ వ పాలనకు అధికార దాహానికి వ్యతిరేకత పెరుగుతూనే ఉంది.దానిని ఆమోదించలేని వివిధ రకాల నాయకులు బిజెపి కి దూరం అవుతూనే ఉన్నారు.

అయితే ఈ క్రమంలోనే బిజెపికి మరొక కీల‌క నేత దూరం అయ్యారు.పార్టీని నడిపించడంలో ఎంతో వ్యుహత్మకంగా వ్యవహరించే ఆయన దూరం అవ్వడం పార్టీ కి తీరని నష్టమే ఎందుకంటే.జ‌నం నాడి క‌నిపెట్టి, బీజేపీ వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌దిద్దే వారిలొ ఈయన విశేషం.అందులోనూ బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ్ మాధ‌వ్ శిబిరంలోని ప్ర‌ధాన వ్య‌క్తి అంతేకాదు ఇండియా ఫౌండేష‌న్ లో ప‌రిశోధ‌కుడిగా కూడా ఉన్నారు ఆయన ఎవరో కాదు శివం శంక‌ర్ సింగ్.

శివశంకర్ అమెరికాలోని మిచిగాన్ యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడ్యుయేష‌న్ పట్టా పొందిన వ్యక్తి.ఇటీవ‌ల ఈశాన్య రాష్ట్రాల ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను విశ్లేషిస్తూ, పార్టీకి దిశానిర్దేశం చేసిన క్యాంప్ లో ప్ర‌ధానంగా ప‌నిచేశారు.

అలాంటి శంక‌ర్ సింగ్ అనూహ్యంగా…బీజేపీకి రాజీనామా చేస్తూ రాసిన లేఖ చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.గతంతో పోలిస్తే రోడ్ల నిర్మాణం వేగంగా జ‌రిగింద‌ని పేర్కొన్న సింగ్ మ‌రికొన్ని అంశాల్లో మోడీ స‌ర్కారు తీరుని అభినందించారు.

అదే స‌మ‌యంలో ఏ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ కొన్ని మంచిప‌నులు జ‌రుగుతూనే ఉంటాయ‌ని పేర్కొన్నారాయ‌న‌.

అయితే శివశంకర్ మోడీ ని వ్యతిరేకించడానికి కారణం ఏమిటంటే.

విదేశీ కార్పోరేట్ల నుంచి అజ్ణాత‌మైన బాండ్లు ఎల‌క్ట్రోర‌ల్ బాండ్లు రూపంలో తీసుకోవ‌డానికి అనుమ‌తించి, అవినీతిని చ‌ట్ట‌బ‌ద్ధం చేయటాన్ని ఆయ‌న తీవ్రంగా నిర‌సించారుఅ.అంతేకాదు సీబీఐ , ఇడిల దుర్వినియోగం చేస్తున్నార‌నిఅ.

అమిత్ షా తన ఇష్టం వచ్చినట్టుగా ఈ రెండు సంస్థలని తన స్వార్ధానికి వాడుకుంటున్నారని ఆరోపించారు.అత్యంత కీలకమైన విషయం పెద్ద నోట్ల రద్దుపై కూడా ఆయన స్పదించారు.

పెద్ద‌నోట్ల ర‌ద్దు విఫ‌ల‌మ‌యిన‌ప్ప‌టికీ, బీజేపీ అంగీక‌రించలేక‌పోతోంద‌ని విమ‌ర్శించారు.ఇలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీలో కొన‌సాగ‌డం దేశానికి శ్రేయ‌స్క‌రం కాద‌ని భావిస్తున్న‌ట్టు శివం శంక‌ర్ సింగ్ పేర్కొన్నారు…దేశానికి మోడీ ప్రధాని అయితే దేశం మరింతగా దీనావస్థలో ఉంటుందని శివ శంకర్ కామెంట్స్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube