రాంమాధవుడు రాజకీయం ఏపీలో వర్క్ అవుట్ అవుతుందా?

ఏపీలో ఇప్పుడు ఉన్న పొలిటికల్ స్పేస్ ని బీజేపీ ఎలా అయిన సొంతం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.ఇందులో భాగంగా ఇప్పటికే తెలుగు దేశం పార్టీని భూస్థాపితం చేసి ఆ స్థానంలోకి తాము వెళ్లాలని భావిస్తుంది.

 Ram Madhav Key Player In Ap Politics-TeluguStop.com

దీనికి ఇప్పటికే పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకొని టీడీపీ నేతలని తమ పార్టీలోకి తీసుకుంటుంది.ఇప్పటికే ఒక్కొక్కరుగా టీడీపీ మాజీలు అందరూ బీజేపీలోకి ఫిరాయిస్తున్నారు.

ఇక త్వరలో టీడీపీకి కీలకంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరబోతున్నారు అంటూ ఆ పార్టీ నేతలే నేరుగా చెబుతున్నారు.పది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకొస్తున్నారు.

అయితే వారు ఎవరు అనేది మాత్రం చెప్పడానికి ఇష్టపడటం లేదు.

ఇదిలా ఉంటే మరో వైపు పవన్ కళ్యాణ్ ని కూడా బీజేపీలోకి తీసుకొచ్చి అతని నాయకత్వంలో పార్టీని నడిపించడంతో పాటు రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా అతనిని తెరపైకి తీసుకొచ్చేందుకు పావులు కదిపారు.

ఇందులో ముఖ్యపాత్ర వహించింది బీజేపీ జాతీయ నేత రాం మాధవ్.ఇప్పుడు ఈ పేరు ఏపీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.రెండేళ్ళ క్రితం వరకు ఎవరికి పెద్దగా తెలియని రాం మాధవ్ ఇప్పుడు ఎక్కువగా ఏపీలో ఉంటూ బీజేపీ పార్టీ బలం పెంచే ప్రయత్నం చేస్తున్నాడు.టీడీపీ నేతలతో సంప్రదింపులు జరిపి వారికి లోపాయకారి ఆశచూపించి బీజేపీలో చేరేలా చేస్తున్నారు.

అతని వ్యూహాలు ఇప్పుడు తెలుగు దేశం నేతలని టెన్షన్ పెడుతున్నాయి.ఇక రాం మాధవ్ కారణంగా ఎప్పుడు ఎవరు టీడీపీని వీడి బీజేపీలో చేరుతారో అనేది అర్ధం చంద్రబాబుకి సైతం అర్ధం కాకుండా ఉంది.

క్యాంపు రాజకీయాలు కాకుండా వ్యూహాత్మక ఎత్తుగడలతో ఏపీలో బీజేపీ పార్టీని బలంగా తయారు చేస్తున్న అతని రాజకీయానికి ఏపీ ప్రజలు ఎంత వరకు లోన్గిపోతారో అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube