అయ్యో రామ్‌మాధవ్‌ పని అయిపోయినట్టేనా       2018-06-23   03:05:44  IST  Bhanu C

రామ్‌మాధవ్‌ మొన్నటివరకూ ఈయన షా కోటరీలో అత్యంత ముఖ్యుడు షా, రామ్‌మాధవ్‌ లు ఇద్దరు కలిసి తీసుకునే నిర్ణయాలు ఎంతో వ్యూహాత్మకంగా ఉంటాయి..అయితే ఏ రాష్ట్రంలో సమస్య ఉంటే ఆ రాష్ట్రానికి రామ్‌మాధవ్‌ ని వ్యూహాత్మక నిపునిడిగా పంపే బీజేపీ ఆ ప్రాంతంలో ఉండే సమస్యలని పరిష్కరించేలా చేస్తుంది దాంతో రామ్‌మాధవ్‌ కి పార్టీలో పూర్తీ స్థాయిలో ప్రాధాన్యత వచ్చింది..అయితే బజాపాలో రామ్‌మాధవ్‌ అంచెలంచెలుగా ఎదుగుతూ కీలకమైన పాత్రని పోషించే దిశగా అడుగులు వేశారు..ఆ అడుగులు ఏకంగా బీజేపి అధ్యక్షా పీటంవైపు వెళ్ళాయి దాంతో షా కి కన్ను కుట్టడం మొదలయ్యింది.

అయితే ఇప్పుడు అధ్యక్షునిగా ఉన్న అమిత్ షా కు ఈ పరిణామాలు మంట పుట్టిస్తున్నాయి..దాంతో ఇప్పుడు మోడీ షాలు ఇద్దరు రామ్‌మాధవ్‌ ని టార్గెట్ చేశారు..ఇప్పుడు రామ్‌మాధవ్ పార్టీలో ఎందుకు పనికి రాని వ్యక్తిగా చేసేశారు..అందులో భాగంగానే ఆయనకు క‌శ్మీర్ ఇన్చార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఆయన చొరవతోనే పీడీపీ-బీజేపీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. కశ్మీరుసంకీర్ణం సుస్థిరమని 3 నెలలుగా ఆయన చెబుతున్న మాటలన్నింటినీ అపహాస్యం చేస్తూ బీజేపీ అధినాయకత్వం లోయలో సంకీర్ణ సర్కారుకు గుడ్‌బై చెప్పింది.

దాంతో ఈ పరిస్థితికి రామ్‌మాధవ్‌ మెతక వైఖరి కారణం అంటూ షా వర్గం ఆలోపణలు చేసింది సంకీర్ణ సర్కారును వదిలించుకోవాలన్న నిర్ణయాన్ని మోదీ-అమిత్‌షాలు రాంమాధవ్‌ను సంప్రదించకుండానే చేశారు. చివరికి తప్పులన్నింటినీ ఆయన మీదకు నెట్టేశారు…దాంతో ఇప్పుడు ఎంతో పరిజ్ఞానం ఉండి..తెలివైన రామ్‌మాధవ్‌ పరిస్థితి మోదీ-అమిత్‌షాలకు భజన చేసేలా మారిపోయింది. నిజానికి కశ్మీర్ విషయంలో కేంద్రం క్లారిటీ లేని విధానాలే… రామ్‌మాధవ్‌కు చిక్కులు తెచ్చి పెట్టాయి…ఎలా అంటే

ప్రమాణ స్వీకారానికి నవాజ్‌ షరీఫ్ ను పిలిచి, ఆయన మనుమరాలి వివాహానికి వెళ్లిన నరేంద్ర మోదీ మరోవైపు కాశ్మీర్‌లో సైనిక చర్యలను ఉద్ధృతం చేశారు. మోదీ సర్కారు వైఫల్యాలను రాంమాధవ్‌పై రుద్దే ప్రయత్నం చేశారు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని దెబ్బకొట్టారు..అక్కడ రామ్ మాధవ్ కి పొగ పెడుతూనే ఇక్కడ జీవీఎల్ లాంటి వారికి బలం ఇస్తున్నారు…అయితే ఎంతో అనుభవం కలిగిన రామ్‌మాధవ్‌ సైతం మోడీ షా ల కుళ్ళు రాజకీయాలకి బలై పోయారు అంటున్నారు పార్టీలోని సీనియర్ నేతలు..