రామ్‌, థమన్‌ మద్య ఏం జరిగింది? మళ్లీ దేవినే ఎందుకు వచ్చాడో!

ఎనర్జిటీక్ స్టార్‌ రామ్‌ ఈ ఏడాది రెడ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పర్చాడు.చాలా ఆశలు పెట్టుకుని థియేటర్లు ఓపెన్‌ అయ్యే వరకు వెయిట్‌ చేసి సంక్రాంతి కానుకగా విడుదల చేసిన రెడ్‌ సినిమా నిరాశ పర్చడంతో రామ్ తదుపరి సినిమా విషయంలో కాస్త ఆలోచనల్లో పడ్డాడు.

 Ram Lingu Swamy Movie Music Director Devi Sri Prasad-TeluguStop.com

రెడ్‌ పూర్తి అయ్యి చాలా నెలలు అయినా కూడా ఎలాంటి సినిమా చేయాలో పాలుపోక వెయిట్‌ చేస్తూ వచ్చాడు.ఎట్టకేలకు తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.

లింగు స్వామి దర్శకత్వం అనగానే కొందరు పెదవి విరుస్తున్నారు.కాని రామ్ మాత్రం ఆయన పై చాలా నమ్మకంగా ఉన్నాడు.

 Ram Lingu Swamy Movie Music Director Devi Sri Prasad-రామ్‌, థమన్‌ మద్య ఏం జరిగింది మళ్లీ దేవినే ఎందుకు వచ్చాడో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే ఆయన దర్శకత్వంలో సినిమా ను వెంటనే షురూ చేయబోతున్నట్లుగా ఇటీవల ప్రకటించాడు.ఇక రామ్‌ తదుపరి సినిమా కు సంగీత దర్శకుడిగా థమన్‌ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

కాని ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ ను రంగంలోకి దించుతున్నట్లుగా తెలుస్తోంది.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత సారథ్యంలో ఇప్పటి వరకు రామ్‌ ఆరు సినిమాలు చేశాడు.

ఇది ఏడవ సినిమా అవుతుంది.కనుక రామ్‌ ఈ సినిమా కు దేవి శ్రీ ప్రసాద్‌ ను ఎంపిక చేయమని దర్శకుడు లింగు స్వామికి సూచించడం జరిగింది.

ఈ సమయంలో థమన్ కంటే దేవి శ్రీ ఫ్రీ గా ఉంటున్నాడు.కనుక ఆయనకు తప్పకుండా సక్సెస్‌ కావాలి కనుక కసితో చేస్తాడు.

అందుకే దేవి శ్రీ ప్రసాద్‌ కు దర్శకుడు లింగు స్వామి మరియు రామ్‌ లు కలిసి ఆఫర్ ఇచ్చారని అంటున్నారు.థమన్ విషయంలో కూడా రామ్‌ ఆలోచించినప్పటికి సెంటిమెంట్‌ ప్రకారం దేవి శ్రీ ప్రసాద్ తో వెళ్తే కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

కొత్త గా థమన్‌ తో జత కట్టడం వల్ల సెంటిమెంట్‌ దెబ్బ తినే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Devi Sri Prasad #Tamil Film #Lingu Swamy #Thaman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు