Ram laxman allu arjun : బన్నీ సూపర్ అని పొగిడి తర్వాత అలా చేశారు.. రామ్ లక్ష్మణ్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన రామ్ లక్ష్మణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.చెన్నై వాతావరణం హైదరాబాద్ లో ప్రభావితం చేస్తుందనే కామెంట్లపై రామ్ లక్ష్మణ్ స్పందిస్తూ అన్ని సినిమాలను ఒప్పుకోవడం కుదరదని తెలిపారు.

 Ram Laxman Shocking Comments Goes Viral In Social Media Details Here ,ram Laxma-TeluguStop.com

ఫైట్ మాస్టర్ల మధ్య ఇప్పుడు సమస్యలు లేవని రామ్ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.మేము కథను డిస్టర్బ్ చేయమని డైరెక్టర్లు భావిస్తారని వాళ్లు తెలిపారు.

అరవింద సమేత వీర రాఘవ క్లైమాక్స్ లో ఫైట్ సీన్ కరెక్ట్ కాదని మేము భావించామని ఆ విషయాన్ని మేము త్రివిక్రమ్ కు చెప్పామని రామ్ లక్ష్మణ్ అన్నారు.ఫైట్ అవసరం లేకుండానే ఆ సినిమా క్లైమాక్స్ ను ముగించడం జరిగిందని రామ్ లక్ష్మణ్ పేర్కొన్నారు.

కథ ఏం అడుగుతుందో దానిని బట్టి చేయాల్సి ఉంటుందని వాళ్లు చెప్పుకొచ్చారు.కథలోకి వెళ్లడం ముఖ్యమని వాళ్లు అన్నారు.

Telugu Allu Arjun, Andhrudu, Aravindasametha, Masters, Race Gurram, Ram Laxman,

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో ఫస్ట్ ఫైట్ కంపోజ్ చేసే ఛాన్స్ మాకు వచ్చిందని తెలిపారు.ఆ సినిమా కథ అర్థం కాకపోవడంతో రెండు రోజుల పాటు ఫైట్ కంపోజ్ చేయాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోయామని రామ్ లక్ష్మణ్ అన్నారు.అంతకుముందే రేసుగుర్రం సినిమాకు పని చేయడంతో బన్నీ తమకు సూపర్ అని కాంప్లిమెంట్ ఇచ్చారని వాళ్లు వెల్లడించారు.కానీ ఆ తర్వాత ఆ సినిమా నుంచి మమ్మల్ని తీసేయడం జరిగిందని వాళ్లు చెప్పుకొచ్చారు.

మేము కథను కొంచెం గట్టిగా ఫాలో అవుతామని రామ్ లక్ష్మణ్ వెల్లడించారు.ఆంధ్రుడు సినిమాలో ఛాన్స్ వస్తే క్లైమాక్స్ ను డైరెక్టర్ మాట కూడా వినకుండా షూట్ చేశామని రామ్ లక్ష్మణ్ పేర్కొన్నారు.

రామ్ లక్ష్మణ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube