కన్న కొడుకు కాళ్ళు పట్టుకొని మరి బ్రతిమిలాడినా రామ్- లక్ష్మణ్

రామ్ లక్ష్మణ్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ ఫైట్ మాస్టర్ లుగా కొనసాగుతున్నారు.ఇక ఇద్దరు అన్నదమ్ములు ఏదైనా ఫైట్ కంపోజ్ చేశారు అంటే చాలు అది సినిమాలోనే సూపర్ హిట్ గా నిలుస్తూ ఉంటుంది.

 Ram Lakshman About His Son Arya Details, Tollywood Industry, Ram Lakshman, Fight-TeluguStop.com

ఇలా ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో ఫైట్ కంపోజ్ చేసి ప్రేక్షకులను అలరించిన ఇద్దరు ఫైట్ మాస్టర్లు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ ఫైట్ మాస్టర్ గా కొనసాగుతున్నారు అయితే తెర వెనుక ఉండే స్టార్లుగా కొనసాగుతున్న ఇద్దరు ఎన్నో కష్టాలు పడి స్వయంకృషితో ఈ స్థాయికి ఎదిగారు అని చెప్పాలి.

కాగా ఏదైనా ఇంటర్వ్యూలో వీరి జీవితం గురించి అడిగితే మనసును కదిలించే ఎన్నో కష్టాల గురించి అప్పుడప్పుడూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇక రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్లు జీవితం తొలినాళ్లలో పడిన కష్టాలు ఎంతోమందిలో స్ఫూర్తిని నింపుతాయి అని చెప్పాలి.

పొగడ్తలు వచ్చినప్పుడు పొంగిపోయి విమర్శలు వచ్చినప్పుడు కుంగిపోవడం అలాంటివి అస్సలు చేయరు.ఎప్పుడు వినయ విధేయతలను కనబరుస్తూ ఉంటారు ఇద్దరు ఫైట్ మాస్టర్.

అయితే ఇటీవలే ఈ ఇద్దరు ఫైట్ మాస్టర్ లు ఒక ఇంటర్వ్యూకు హాజరు కాగా.ఇందులో ఒకరు కొడుకు విషయంలో ఎదురైనా ఒక అనుభవాన్ని పంచుకున్నారు.

వీరిద్దరూ పంచుకున్న అనుభవం అటు నేటి రోజుల్లో తల్లిదండ్రులు అందరికీ వర్తిస్తుంది అని చెప్పాలి.వారి మాటల్లో.

మా చిన్నబ్బాయి పేరు ఆర్య. అతను ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా చాలా లావుగా అయ్యాడు.

అంతేకాదు ఇక చదువుకోకుండా స్నేహితులతో తిరుగుతూ చెడు అలవాట్లు కూడా నేర్చుకున్నాడు.ఈ విషయం తెలిసి ఎంతో బాధపడ్డాను.

ఆర్యను మార్చడం ఎలాగో అర్థం కాలేదు.

ఓ రోజూ ఇక ఈ విషయాలపై అడగాలని నిర్ణయించుకున్నాను.ఆ సమయంలో ధ్యానం లో కూర్చున్నాను.దీంతో నేను ఎక్కడ కొడతానో అని భయపడి పోతున్నాడు ఆర్య.

అయితే వాడికి అన్నం పెట్టు పోషిస్తున్నాను కాబట్టి ఒక తండ్రిగా కొట్టే హక్కు నాకు ఉంది.కానీ కొట్టడం తిట్టడం కాకుండా ఇంకా ఎలా సమస్యను పరిష్కరించవచ్చు అని ఆలోచించాను.

అప్పుడు నేరుగా ఆర్య దగ్గరకు వెళ్లి కాళ్లు పట్టుకున్నాను. ఒరేయ్ మీ అమ్మ నీ చెడు అలవాట్ల గురించి చెప్పింది.

ఇప్పుడు కోపంతో నేను నిన్ను కొట్టొచ్చు తిట్టొచ్చు ఇంట్లో నుంచి బయటకు పంపే అధికారం కూడా నాకు ఉంది కానీ నేను అలా చేయడం లేదు.ఒక్కసారి మన కుటుంబం గురించి ఆలోచించు.

రామ్ లక్ష్మణ్ అంటే బయట ఎలా ఉన్నారు అన్నది ఆలోచించు… అప్పుడు రామ్ లక్ష్మణ్ కొడుకు గా నువ్వు ఎలా ఉండాలి అన్నది అర్థమవుతుంది అంటూ పది నిమిషాలపాటు చెప్పడంతో వెంటనే ఆర్య మారిపోయాడు.దీంతో ఆరోగ్యం పై దృష్టి పెట్టి 105 కేజీల నుంచి 70 కేజీలకు వచ్చాడు.చెడు అలవాట్లను కూడా పూర్తిగా దూరం అయిపోయాడు.ఇలా పిల్లల విషయంలో ద్వేషం గా ఉంటే వాళ్లు మరింత చెడిపోతారు.అందుకే వారికి అర్థమయ్యే విధంగా చెబితే మారుతారు అంటూ చెప్పుకొచ్చారు రామ్ లక్ష్మణ్ మాస్టర్లు.

.

Fight Masters Ram Laxman about his Son Arya

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube