‘రెడ్‌’ తో అప్పుడే రికార్డు సాధించిన రామ్‌

యంగ్‌ హీరో రామ్‌ ప్రస్తుతం రెడ్‌ సినిమాతో రెడీ అవుతున్న విషయం తెల్సిందే.కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఈ సమ్మర్‌లో విడుదల చేయాల్సి ఉంది.

 Ram Red Movie Hindhi Dubbing Rights Sale In Huge Price, Ram, Ismart Shanker, Red-TeluguStop.com

కాని కరోనా కారణంగా ఆలస్యం అవుతుంది.సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది.

వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా హిట్‌ అయిన కారణంగా ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇక ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ ఏకంగా 12.5 కోట్లకు బేరం సాగుతున్నట్లుగా చెబుతున్నారు.

హిందీలో రామ్‌ నటించిన గత చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

థియేటర్లలో విడుదల కాకున్నా కూడా సినిమాను డబ్‌ చేసి టీవీల్లో మరియు యూట్యూబ్‌లో ప్రసారం చేశారు.దాంతో ఆ సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి.ముఖ్యంగా ఉన్నది ఒక్కటే జిందగీ, నేను శైలజ, హలో గురు ప్రేమ కోసమే, ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రాలు వందల మిలియన్‌ల వ్యూస్‌ను రాబట్టాయి.

Telugu Ismart Shanker, Nenu Sailaja, Ram Pothineni, Unnadiokkate-Movie

అతి తక్కువ సమయంలో ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రం వంద మిలియన్‌ల వ్యూస్‌ను రాబట్టి రికార్డుగా నిలిచింది. ఇక తెలుగులో ఎంతో మంది చిన్న హీరోలు ఉన్నారు.వారిలో ఏ ఒక్కరి సినిమాకు కూడా హిందీ డబ్బింగ్‌కు 5 కోట్లను మించి వచ్చింది లేదు. కాని రెడ్‌ సినిమాకు మాత్రం ఏకంగా 12.5 కోట్లు వస్తున్న నేపథ్యంలో రామ్‌ రికార్డు కొట్టినట్లుగా అంతా చెబుతున్నారు. రామ్‌ ఈ చిత్రంపై చాలా నమ్మకంతో ఉన్నాడు.విభిన్నమైన కథతో ఈ సినిమా రూపొందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube