సెన్సార్‌కే షాక్‌ ఇస్తూ కమ్మరాజ్యంలో కడప రెడ్లు విడుదలకు సిద్దమైన వర్మ  

Ram Gopalvarma Ready To Release The Movie-kamma Rajyamalo Kadapa Reddlu,ram Gopalvarma,tollywood Director Ram Gopalvarma

రామ్‌ గోపాల్‌ వర్మ సెన్షేషన్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ అని చెప్పుకోవచ్చు.ఆయన ఏం చేసినా కూడా సంచలనం అన్నట్లుగా ఉంటుంది.

Ram Gopalvarma Ready To Release The Movie-kamma Rajyamalo Kadapa Reddlu,ram Gopalvarma,tollywood Director Ram Gopalvarma Telugu Tollywood Movie Cinema Film Latest News-Ram Gopalvarma Ready To Release The Movie-Kamma Rajyamalo Kadapa Reddlu Ram Tollywood Director

ఆయన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా ఎంతటి సంచలనమో అంతకు పది రెట్ల సంచలనాత్మకంగా రూపొందిన సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.ఈ సినిమాను విడుదల చేసేందుకు వర్మ చాలా కష్టపడుతున్నాడు.

సెన్సార్‌ బోర్డు ఆయన సినిమాకు క్లీయరెన్స్‌ ఇవ్వడం లేదు.దాంతో సినిమాను విడుదల చేయడం కష్టం అయ్యింది.

సెన్సార్‌ క్లియరెన్స్‌ వచ్చి ఉంటే సినిమా ఇప్పటికే విడుదల అయ్యేది.కాని సినిమాకు సెన్సార్‌ క్లియరెన్స్‌ ఇవ్వలేదు.దానికి తోడు సినిమా హైకోర్టుకు వెళ్లింది.దాంతో చేసేది లేక వర్మ సినిమాను వాయిదా వేస్తూ వస్తున్నాడు.

సినిమా విడుదల కోసం ప్రయత్నించడం వృదా అని, సినిమాకు సెన్సార్‌ కావాలి అంటే కనీసం 50 శాతం సీన్స్‌ను తొలగించాల్సి ఉందట.దాంతో వర్మ సినిమా విడుదల చేయడం అసాధ్యంగా మారిపోయింది.

రామ్‌ గోపాల్‌ వర్మ సెన్సార్‌ క్లియరెన్స్‌ రాకున్నా సినిమాను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాడు.థియేటర్లలో సినిమాను విడుదల చేయాలంటే సెన్సార్‌ కాపీ కావాలి.

కాని ఆన్‌లైన్‌లో డైరెక్ట్‌గా విడుదల చేయడానికి ఎలాంటి పర్మీషన్స్‌ అవసరం లేదు.ఇప్పుడు వర్మ చేయబోతున్నది అదే.

అమెజాన్‌ ప్రైమ్‌ లో సినిమాను స్ట్రీమ్‌ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు.అమెజాన్‌ వారు భారీ మొత్తాన్ని పెట్టి ఈ సినిమాను కొనుగోలు చేయబోతున్నారు.

వారం పది రోజుల్లో ఈ సినిమా ఆన్‌లైన్‌కు రాబోతుంది.

తాజా వార్తలు

Ram Gopalvarma Ready To Release The Movie Related....