వర్మపై మార్ఫింగ్‌ కేసు నమోదు  

ram gopalvarma ka paul and jyothi - Telugu Amma Rajyamlo Kadapa Biddalu, Case File On Ram Gopalvarma, Ka Paul And Jyothi, Ram Gopalvarma, Tollywood Director

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తన సినిమాలు తాను చేసుకోకుండా ఏపీ రాజకీయాలపై పడ్డాడు.దాంతో ఇప్పుడు కేసుల మీద కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

TeluguStop.com - Ram Gopalvarma Ka Paul And Jyothi

గత కొన్ని రోజులుగా తన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అలియాస్‌ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ప్రమోషన్‌ కోసం రచ్చ రచ్చగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.అందులో భాగంగా కేఏపాల్‌ మరియు అతడి పీఏ జ్యోతి కలిసి వర్మకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇస్తున్నట్లుగా ఒక ఫొటోను పోస్ట్‌ చేశాడు.

అది బాగా వైరల్‌ అయ్యింది.దాంతో ఇప్పుడు పాల్‌ అండ్‌ కో స్పందించింది.

తమ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడంటూ పోలీసులకు పాల్‌ మరియు జ్యోతిలు ఫిర్యాదు చేశారు.వారి ఫిర్యాదతో ప్రస్తుతం పోలీసులు రంగంలోకి దిగారు.

ఎవరో మార్ఫింగ్‌ చేస్తే వర్మ షేర్‌ చేశాడంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.అయితే పోలీసులు మాత్రం డైరెక్ట్‌గా వర్మను ప్రశ్నించేందుకు సిద్దం అవుతున్నారు.

హైదరాబాద్‌ పోలీసులు త్వరలోనే వర్మను విచారించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.ఈ వారంలో కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

#AmmaRajyamlo #CaseFile #Ram Gopalvarma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Gopalvarma Ka Paul And Jyothi Related Telugu News,Photos/Pics,Images..