వర్మపై పెట్టుకున్న ఆశలు అడియాశలే.. మంత్రి మాటలతో ఆవేదన

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరికి నచ్చాయి.ముఖ్యంగా ఇండస్ట్రీలో ఈమద్య కాలంలో ఎవరు కూడా ఆయన వాదనతో ఏకీభవించలేదు.

 Ram Gopal Varma Went And Talk With Perni Nani Details, Ram Gopal Varma, Minister-TeluguStop.com

కాని ఇప్పుడు ఆయన మాట్లాడుతూ టికెట్ల రేట్ల విషయమై ఏపీ ప్రభుత్వంను ప్రశ్నించాడు.దాంతో ప్రతి ఒక్కరు కూడా ఆయన్ను అభినందిస్తున్నారు.

తాజాగా పేర్ని నానితో భేటీకి వెళ్లిన రామ్‌ గోపాల్‌ వర్మ పై మొత్తం టాలీవుడ్ చాలా ఆశలు పెట్టుకుంది.కాని మొత్తం తలకిందులు అయ్యింది.

రామ్‌ గోపాల్ వర్మ అంటే వైకాపాకు కాస్త మద్దతు అనే పేరు ఉంది.కనుక ప్రతి ఒక్కరు కూడా వర్మ మరియు నాని మీటింగ్‌ తర్వాత ఏదో ఆసక్తికర పాజిటివ్ స్పందన వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు.

కాని మొత్తం తలకిందులు అన్నట్లుగా పరిస్థితి మారింది.వర్మ బయటకు వచ్చిన తర్వాత ఒంటరిగా మాట్లాడాడు.

నా అభిప్రాయాలను వారికి తెలియజేశాను.వారు విన్నారు.వారి నిర్ణయం తుది నిర్ణయం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఆయన మాటలు బట్టి చూస్తుంటే పెద్దగా ప్రయోజనం ఏమీ లేదా అన్నట్లుగా అనిపించింది.

అదే సమయంలో వర్మ తో మీటింగ్‌ తర్వాత మంత్రి మాట్లాడుతూ ఇండస్ట్రీకి చెందిన వారు ఎవరైనా వచ్చి తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.ఒక కమిటీ వేశాం.

ఆ కమిటీ కి తమ సమస్యలు తెలియజేసి టికెట్ల రేట్ల విషయంలో విజ్ఞప్తులు ఇవ్వవచ్చు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

Telugu Ap, Ap Ticket Rates, Corona Wave, Ram Gopal Varma, Jagan, Perni Nani, Tol

అంటే ముందు ముందు నిర్ణయం తీసుకుంటే వర్మ వల్ల కాదు అనేది క్లారిటీ వచ్చేసింది.వర్మ వెళ్లి హడావుడి చేసినా కూడా పెద్దగా ఒరిగింది పెరిగింది ఏమీ లేదు.ఈ విషయంలో టాలీవుడ్‌ ఆశలు అడి యాశలు అయ్యాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా థర్డ్‌ వేవ్‌ ముగిసే వరకు అయినా టికెట్ల రేట్ల విషయంలో ఒక క్లారిటీ కి రావాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు.ఇదే సమయంలో టాలీవుడ్‌ నిర్మాతలు బలిసి కొట్టుకుంటున్నారు అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube