రామ్‌కు గురి పెట్టిన వర్మ బాణం

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా ఇటీవలే వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.రామ్‌ హీరోగా ఈ చిత్రంలో మంచి నటనతో ఆకట్టుకున్నాడు అంటూ వర్మ మొదటి నుండి ప్రచారం చేస్తూ వచ్చాడు.

 Ram Gopal Varma Want Direct A Movie With Ram-TeluguStop.com

తన శిష్యుడు పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ అంటూ పూరి వరుసగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టడంతో పాటు నానా హడావుడి చేయడం జరిగింది.

రామ్‌కు గురి పెట్టిన వర్మ బాణ�

శంకర్‌ పాత్రను చాలా బాగా రామ్‌ పోషించాడని, అతడి ఎనర్జికి తాను ఫిదా అయ్యానంటూ వర్మ ట్వీట్స్‌ చేశాడు.రామ్‌తో తాను ఇన్నాళ్లు వర్క్‌ చేయలేక పోయినందుకు బాధగా ఉందని, అతడితో త్వరలోనే సినిమా చేయాలని కోరుకుంటున్నట్లుగా పూరితో అన్నట్లుగా తెలుస్తోంది.రామ్‌ కూడా తప్పకుండా మీరు వస్తే నటించేందుకు నేను సిద్దం అంటూ ప్రకటించాడు.

ఈమద్య కాలంలో రామ్‌ గోపాల్‌ వర్మ చేసిన ఏ తెలుగు సినిమా కూడా సక్సెస్‌ అయిన దాఖలాలు లేవు.అయినా కూడా రామ్‌ మాత్రం వర్మ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నాడు.

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఒకప్పుడు ఆణిముత్యాలాంటి సినిమాలు వచ్చాయి.అందుకే ఆయన దర్శకత్వంలో నటించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

సినిమా సక్సెస్‌ అవ్వదని తెలిసినా కూడా ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వస్తారు.అలాగే రామ్‌ కూడా వర్మ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పాడు.

త్వరలోనే వర్మ ఒక స్క్రిప్ట్‌ను రామ్‌ కోసం సిద్దం చేస్తాడేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube