అరియానాకు క్షమాపణలు చెప్పిన వర్మ.. ఎందుకంటే..?

వివాదాస్పద దర్శకుడు అయిన రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో సక్సెస్ లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వార్తల్లో నిలుస్తున్నారు.తాజాగా ఆర్జీవీ అరియానాకు సారీ చెప్పారు.

 Ram Gopal Varma Tweet About Interview Teaser Release Ariyana Glory-TeluguStop.com

అరియానా ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయగా కొన్నిరోజుల క్రితం నుంచి ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.అయితే ప్రోమో రిలీజ్ ఆలస్యం అయినందుకు తాను అరియానాకు సారీ చెబుతున్నానని వర్మ అన్నారు.

యూట్యూబ్ ఇంటర్య్వూల ద్వారా ప్రేక్షకుల్లో గుర్తింపును సంపాదించుకున్న అరియానా ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయడం ద్వారా పాపులారిటీని మరింత పెంచుకున్నారు.ఆ పాపులారిటీ వల్లే అరియానాకు బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కింది.

 Ram Gopal Varma Tweet About Interview Teaser Release Ariyana Glory-అరియానాకు క్షమాపణలు చెప్పిన వర్మ.. ఎందుకంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బిగ్ బాస్ షోలో సాధారణ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన అరియానా టాస్క్ లు అద్భుతంగా చేస్తానని ప్రూవ్ చేసుకున్నారు.టాప్ 5 కంటెస్టెంట్ల జాబితాలో అరియానా కూడా ఉన్నారు.

Telugu Ariyana Glory, Ariyana Interview Rgv, Bigg Boss, Interview, Ram Gopal Varma, Rgv Sorry To Ariyana, Teaser Release Date, Tollywood-Movie

అరియానా బిగ్ బాస్ షో విన్నర్ అవుతారని ఆమె ఫ్యాన్స్ భావించినా అరియానా మాత్రం టాప్ 4 స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది.బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత సినిమా ఆఫర్లతో బిజీ అవుతున్న అరియానా కామెడీ షోలలో స్కిట్లు కూడా చేసి మెప్పిస్తున్నారు.బుల్లితెరపై, వెండితెరపై హవా కొనసాగిస్తున్న అరియానా తాజాగా ఆర్జీవీని బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు.

Telugu Ariyana Glory, Ariyana Interview Rgv, Bigg Boss, Interview, Ram Gopal Varma, Rgv Sorry To Ariyana, Teaser Release Date, Tollywood-Movie

నిన్న టీజర్ రిలీజ్ కాగా టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం గమనార్హం.ఈరోజు రాత్రి 7 గంటలకు ఫుల్ ఇంటర్యూను రిలీజ్ చేస్తానని ఆర్జీవీ వెల్లడించారు.ఈ ఇంటర్వ్యూలో ఆర్జీవీ ఏయే విషయాల గురించి వెల్లడిస్తారో చూడాల్సి ఉంది.

ఈ ఇంటర్వ్యూ అరియానా కెరీర్ కు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో తెలియాల్సి ఉంది.ఈ ఇంటర్వ్యూ గురించి అరియానా టెన్షన్ పడుతున్నట్టు ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

#TeaserRelease #Bigg Boss #RgvSorry #Ram Gopal Varma #Ariyana Glory

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు