బాలయ్య నాగబాబు మధ్యలోకి వర్మ..! ఎలాంటి కామెంట్స్ చేసారో చూడండి! ఎవర్ని సపోర్ట్ చేసారంటే.?     2019-01-08   10:46:37  IST  Sai Mallula

మెగా బ్రదర్ నాగబాబు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మధ్య అందుకు తగ్గట్టుగా నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన అంతకు ముందుకంటే ఎక్కువగా… యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా…. సినీనటుడు హిందూపూర్ తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని టార్గెట్ చేస్తునట్టు కనిపిస్తోంది. . మొన్న ఆ మధ్య ‘బాలయ్య ఎవరో నాకు తెలియదు’ అనేశారు నాగబాబు. ఆ తర్వాత దానికి కొనసాగింపుగా మరికొన్ని వివాదాస్పద ఫోటోలు షేర్ చేసి. ఆ ఫొటోల్లోని జంతువుల బ్రీడ్స్‌, బ్లడ్‌ ‘రేర్‌’ అని చెప్పుకొచ్చారు. కావాల్సిన వారు కొనుకోండి అంటూ చెప్పుకొచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్ ఎవరో తెలీదు అని బాలయ్య అనడమే ఈ వివాదానికి కారణం.

Ram Gopal Varma Tweet About Balayya Nagababu Issue-Controversy Nagababu

Ram Gopal Varma Tweet About Balayya Nagababu Issue

అయితే ఇప్పుడు అసలు కథ ఏంటి అంటే…కాంట్రవర్సీ కి మరో పేరు అంటే రామ్ గోపాల్ వర్మ అని చెప్పొచ్చు అనుకుంట. ఎప్పుడు వివాదాలకు దగ్గరగా ఉంటూ…తనకు సంబంధం లేని విషయాలలో తలదూర్చడమే వర్మ పని అని అందరికి తెలిసిందే. ఇప్పుడు తాజాగా బాలయ్య నాగబాబు వివాదం పై వర్మ ఎలాంటి కామెంట్స్ చేసారో చూడండి.

Ram Gopal Varma Tweet About Balayya Nagababu Issue-Controversy Nagababu

“కామెంట్స్ లలో నన్ను మించిపోయారనే నా జెలసి …బాధ ఒక వైపు…తన స్టార్ బ్రదర్ లని డిఫెండ్ చేయటంలో సూపర్ స్టార్ అయిపోయారని ఆనందం ఒక వైపు…ఒక కంట కన్నీరు. మరో కంట పన్నీరు. నాగ బాబు గారు హ్యాట్సాఫ్. ఐ లవ్ యువర్ బ్రదర్స్”