ట్రంప్ ని తెగ ట్రోల్స్ చేస్తున్న టాలీవుడ్ దర్శకుడు... అంత కోపం ఎందుకో...

సినిమా పరిశ్రమలో ఎప్పుడూ ఏదో ఒక విషయం పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ సోషల్ మీడియా మాధ్యమాలలో వార్తల్లో నిలిచే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “రామ్ గోపాల్ వర్మ” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కాగా ఇటీవలే అమెరికాలో జరిగినటువంటి ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసందే…

 Ram Gopal Varma Trolling To The Donald Trump, Ram Gopal Varma, Tollywood, Direct-TeluguStop.com

అయితే ట్రంప్ ఓడిపోయినప్పటినుంచి రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెగ ట్రోల్స్  చేస్తున్నాడు.

తాజాగా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఎన్నికలలో ఓడిపోయి దీనంగా కూర్చున్న ట్రంప్ ఫోటోని షేర్ చేశాడు.ఇందులో వింతేముందని అనుకుంటున్నారా.? ఒకసారి ఈ ఫోటోని పరిశీలించినట్లయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నెగిటివ్ ట్రోల్స్ చేస్తూ ట్రంప్ ఫోటోని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశారు.

దాంతో రామ్ గోపాల్ వర్మ ఈ ఫోటోని ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది.

 దీంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటో పై స్పందిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ఎందుకంత కోపం ఆర్జివి.? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఆర్జివి సోషల్ మీడియా మాధ్యమాలలో ఇలాంటి పనులు చేయడం కొత్తేమీ కాదు. ఇటీవలే తన తల్లితో ఏకంగా  మద్యాన్ని తాగించే ప్రయత్నం కూడా చేసాడు.అంతటితో ఆగకుండా ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్లో షేర్ చేసి వైరల్ అయ్యాడు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ తెలుగులో “మర్డర్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

 ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తయినప్పటికీ పలు అనివార్య  కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube