ట్రోలర్స్ ఊరకుక్కలు అంటూ మండిపడ్డ వర్మ.. ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్?

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలా ఉంటారు? ఇలా మాట్లాడతారు? అన్నది ఊహించడం చాలా కష్టం.నిత్యం ఏదో ఒక వివాదంతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.

 Ram Gopal Varma Strong Reaction On Trollings Details, Ram Gopal Varma, Trolings-TeluguStop.com

అంతేకాకుండా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, సినిమాల విషయంలో,ట్వీట్ ల విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ట్రోలింగ్స్ గురించి,ట్రోలర్స్ గురించి తనదైన శైలిలో వాఖ్యలు చేశారు.

ట్రోలర్స్ అంటే మనతో ఉండేవాడే వారే కానీ బయటికి మాత్రం వారు ఎవరో తెలియదు.ఎక్కడ ఉంటారో తెలియదు ఎవరో కూడా తెలియదు.

ఎవరిని అయినా ఏమైనా అనేయచ్చు కదా అలాంటప్పుడు అంతకన్నా ఆనందం ఇంకెవరికి ఉంటుంది.

దేశ ప్రధాని కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్ కావచ్చు.

ఎవరైనా సరే పట్టించుకోరు.మనుషుల్లో ఇన్ని రకాల జంతువులు ఉంటాయా? అని ట్రోల్స్ వల్లే తెలుస్తాయి.ఇక చాలా మంది సెలబ్రెటీలు ట్రోల్స్ కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.అంతేకాకుండా సోషల్ మీడియా నుంచి వెళ్లిపోయిన వారు ఉన్నారు అని చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ.

ట్రోలర్స్ ఒకరు ఇద్దరు ఉండరు కదా.వేలల్లో లక్షల్లో ఉంటారు.అలాంటి వారిపై చర్యలు తీసు కోలేరు.అప్పుడెప్పుడో మీరాచోప్రా జూనియర్ ఎన్టీఆర్ నాకు తెలియదు అని అనిందో లేక వేరే ఏమైనా అయిందో తెలియదు కానీ ట్రోలర్స్ మాత్రం ఆమెపై అనరాని మాటలు అని రెచ్చిపోయారు.

దీంతో ఆమె ఏకంగా కేటీఆర్ కు ఫిర్యాదు చేసింది.

నిజం చెప్పాలి అంటే ట్రోలర్స్ కు ఏ మాత్రం ధైర్యం ఉండదు.కళ్ళల్లో చూడడానికి కూడా భయపడతారు.ట్రోలర్స్ అంతా ఊర కుక్కల తో సమానం.

ఊరికే అరుస్తూ ఉంటారు.కాబట్టి ట్రోలింగ్ ను సీరియస్ గా తీసుకోకూడదు అంతే.

మనం ట్రోలింగ్ ని సీరియస్ గా తీసుకుంటే వాళ్లకు ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది.కాబట్టి ట్రోలింగ్స్ చేసేవారిని పట్టించుకోకపోవడం ఉత్తమమైన మార్గం అని చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube