యాత్ర మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ!  

వైఎస్ఆర్ యాత్ర సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ.

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో కీలక ఘట్టం అయిన పాదయాత్ర నేపధ్యంలో, మమ్ముట్టి మెయిన్ వైఎస్ఆర్ పాత్రలో మహి వి రాఘవ దర్శకత్వంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి అందరికి తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా వైఎస్ అభిమానులని విశేషంగా ఆకట్టుకుంది. ఇక వైఎస్ తో సన్నిహితంగా వుండే వారు అందరూ యాత్ర సినిమా చూస్తూ అప్పటి అనుభవాలని మరో సారి గుర్తుచేసుకుంటున్నారు. ఇక రెగ్యులర్ సినిమా ఆడియన్స్ నుంచి పర్వాలేదనే టాక్ ని ఈ సినిమా తెచ్చుకుంది. ఇక వైఎస్ఆర్ పాత్రలో మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి అద్భుతమైన అభినయంతో అలరించాడని ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికే వైఎస్ తో సన్నిహితంగా వుండే వారందరూ యాత్ర సినిమా చూసి అప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నారు.

ఇదిలా వుంటే తాజాగా వివాదాస్పద దర్శకుడు ఎన్టీఆర్ బయోపిక్ ని లక్ష్మీస్ ఎన్టీఆర్ టైటిల్ తో తెరరూపం ఇస్తున్న సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేసుకుంటున్న ఆర్జీవి తాజా యాత్ర సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసాడు. యాత్ర సినిమాని చూడటం జరిగింది అని, వైఎస్ఆర్ ని దర్శకుడు మహి సిల్వర్ స్క్రీన్ మీద అద్బుతంగా ఆవిష్కరించాడని, మమ్ముట్టి అద్బుతమైన నటన ప్రదర్శించారని ప్రశంసిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. వైఎస్ జీవితంలో జరిగిన పాదయాత్రని మరోసారి సహజంగా చూపించడంలో దర్శకుడు మంచి ప్రతిభ చూపించాడని ఆర్జీవి కామెంట్స్ చేసారు.