నీకు ఇంకా బుద్ది రాలేదా సుమంత్.. రెండో పెళ్లిపై అర్జీవి హాట్ కామెంట్స్!

అక్కినేని మనవడు, నాగార్జున మేనల్లుడు అయినటువంటి సుమంత్ రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.సుమంత్ ఇదివరకే హీరోయిన్ కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

 Ram Gopal Varma About Sumanth Second Marriage Rumors-TeluguStop.com

అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు.వీరిద్దరూ విడాకులు తీసుకొని దాదాపు 15 సంవత్సరాలు కావస్తున్నాప్పటికీ సుమంత్ ఒంటరిగానే జీవిస్తున్నాడు.

ఈ క్రమంలోనే సుమంత్ రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడని తను చేసుకోబోయే అమ్మాయి పేరు పవిత్ర అంటూ ఒక వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.

 Ram Gopal Varma About Sumanth Second Marriage Rumors-నీకు ఇంకా బుద్ది రాలేదా సుమంత్.. రెండో పెళ్లిపై ఆర్జీవి హాట్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ విధంగా సోషల్ మీడియాలో వీరు పెళ్లి పత్రిక వైరల్ గా మారినప్పటికీ పెళ్లి వేడుక ఎక్కడ అనే విషయం కనిపించకపోవడంతో ఈ పెళ్ళి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలోనే సుమంత్ పెళ్లి విషయం గురించి వస్తున్న వార్తలపై అక్కినేని కుటుంబం స్పందించకపోవడం పలు విమర్శలకు దారి తీస్తున్నాయి.ఇకపోతే కాంట్రవర్సి డైరెక్టర్ గా ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసేటటువంటి రాంగోపాల్ వర్మ సుమంత్ పెళ్లి విషయంపై స్పందించారు.

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.

Telugu Ram Gopal Varma, Rgv, Sumanth, Sumanth Marriage, Sumanth Second Marriage-Movie

ఒకసారి పెళ్లి అయిన తర్వాత కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా సుమంత్? నీ కర్మ.ఆ పవిత్ర కర్మ అనుభవించండి.పెళ్లంటే నూరేళ్ల పెంట అయినా రెండో పెళ్లి ఏంటయ్యా సామి? నా మాట విని ఈ పెళ్లి ఆపేయండి.పవిత్ర గారు మీ జీవితాలను పాడు చేసుకోకండి.తప్పు సుమంత్ ది కాదు.మీది కాదు ఈ వ్యవస్థది అంటూ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్లు చేశారు.అయితే సుమంత్ పెళ్లి విషయం పై రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

మరి ఈ విషయంపై సుమంత్ ఏవిధంగా స్పందిస్తాడో వేచిచూడాల్సిందే.

#Ram Gopal Varma #Sumanth #Sumanth #Sumanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు