మహానటుడు ఎన్.టి.ఆర్ గూర్చి దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పిన నిజం  

  • సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు వార్తలలో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ గత కొన్ని నెలలుగా తన కొత్త చిత్రం లక్ష్మీ’స్ ఎన్.టి.ర్ తో వార్తలలో నిలుస్తున్నాడు. తను చెప్పదలచుకొన్న విషయాన్ని నిర్భయంగా, ఎటువంటి బెరుకు లేకుండా దాని పర్యావసానాలగూర్చి ఆలోచించకుండా చెప్పడంలో రాము గారి శైలే వేరు. సోషల్ మీడియా ద్వారా కూడా ఈ చిత్రానికి అధిక ప్రచారం లభిస్తున్నది.

  • ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్లో భాగంగా మహానటుడు ఎన్.టి.ర్ గూర్చి తన దైన శైలిలో ట్విట్టర్లో చెప్పిన తీరు రామగోపాలవర్మ యొక్క చమత్కారానికి ఒక ఉదాహరణగా నిలుస్తున్నది. మహానటుడు ఎన్.టి.ర్ లక్కి నంబరు 9 అన్నది జగత్ విఖ్యాతమే. లక్ష్మీ’స్ ఎన్.టి.ర్ చిత్రం మర్చి 22 న, అర్ధరాత్రి 12గం ల ప్రారంభ షో తో, విడుదల చేయాలని సంకల్పించారు. ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికలు ఏప్రెల్ 11న. మహానటుడు ఎన్.టి.ర్ లక్కి నంబరు 9 అన్న అర్ధం వచ్చేలా వర్మ ఈ క్రింది విధంగా చెప్పారు. 2+2+1+1+1+2=9. అంటే ఈ సినిమా మంచి హిట్ అవుతుంది అన్నది వర్మ గారి లెక్కలలోని మరమార్ధం. అనేక అద్భుతమైన చిత్రాలు అందించి భారతీయ చిత్ర గతినే మార్చేసిన వర్మ గారి చమక్కులే వేరు.

  • Ram Gopal Varma Shares Facts About NTR-Lakshmisntr Muhurtham March 22nd Ram Senior Ntr

    Ram Gopal Varma Shares Facts About NTR

  • మార్చి 22 న విడుదల అయ్యే లక్ష్మీ’స్ ఎన్.టి.ర్ చిత్రంలో పి.విజయకుమార్ N .T. రామారావు గాను, యగ్నా శెట్టి లక్ష్మీ పార్వతిగాను, శ్రితేజ్ నారా చంద్రబాబు నాయుడు గాను, రాజశేఖర్ అనింగి రామ సుబ్బా రెడ్డి గాను నటిస్తున్నారు. గన్ షాట్ బానెర్ క్రిమ్డియా రాకేశ్ రెడ్డి మరియు దీప్తి బాలగిరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాంగోపాల్ వర్మ మరియు అగస్థ మంజు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.