షారుఖ్ ఖాన్ కొడుకుపై అర్జీవి షాకింగ్ ట్వీట్.. ఏమిటంటే?

ఆర్యన్ ఖాన్ ఈ పేరు గత కొద్ది రోజులుగా బాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు ఇతర ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది.బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ కొడుకు ఇటీవలే ముంబై తీరంలోని క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే.

 Ram Gopal Varma Sensational Tweets On Sharukh Khan Son Aryan Kyan, Rgv, Tollywoo-TeluguStop.com

ఈ ఈ సందర్భంగా ఇప్పటికే బాలీవుడ్లో పలువురు ప్రముఖులు ఆర్యన్ ఖాన్ కి మద్దతుగా నిలిచారు.అలాగే షారుక్ ఖాన్ అభిమానులు కూడా ఈ విషయంలో అతని కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ విషయంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

ఆర్యన్ ఖాన్ పై వస్తున్న ఆరోపణల వల్ల ఒరిగేది ఏమీ లేదని ఎంసిబి తో సహా అందరికీ తెలుసని ఆర్జివి పేర్కొన్నారు.

వ్యూహాత్మకంగా అడ్డుకునే ప్రక్రియ ముగిసిన తరువాత ఆర్యన్ ఖాన్ బయటకు వచ్చేస్తాడని ఆయన తెలిపారు.షారుక్ కుమారుడిని వదల్లేదు అంటే ఇక మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అన్న సందేశం అందరికీ వినిపించడం కోసం ఈ సంబంధిత ఏజెన్సీలు అన్ని ఆర్యన్ ను ఉపయోగించుకుంటున్నాయి అని ఆర్జివి అభిప్రాయపడ్డారు.

జైల్లో ఉండటం వల్ల ఆర్యన్ మానసికంగా దెబ్బ తింటాడని చాలామంది అనుకుంటున్న విషయాన్ని కూడా ఆర్జీవి గుర్తు చేశారు.

ఏమీ లేని స్థాయి నుంచి సూపర్ స్టార్ గా ఈ క్రమంలో షారుక్ ఖాన్ పడిన ఇబ్బందులతో పోల్చుకుంటే ఆర్యన్ ఖాన్ జైల్లో పడే ఇబ్బందులు చిన్నవని ఆర్జీవి తెలిపారు.ఇక ఆర్యన్ ను లాంచ్ చేసే ప్రక్రియలో నాలుగు ముఖ్యమైన అంశాలు ఉన్నాయని ఆర్జీవి తెలిపారు.అందులో మొదటిది కుమారుడిగా షారుక్, ఆ తరువాత ఆర్యన్ తొలి సినిమా దర్శకుడు, ప్రస్తుతం ఎన్సీబీ, మరీ ముఖ్యంగా తండ్రి కన్నా ముందే అతని లాంఛ్ చేసిన మీడియా.

ఇక ఈ జాబితాలో టాప్ మాత్రం ఎన్సీబీనే అని ఆర్జివి ట్వీట్ చేశారు.అంతే కాకుండా జీవితం గురించి తండ్రికన్నా జైలు ఎన్సీబీ నుంచి ఎక్కువ నేర్చుకున్నానని ఆర్యన్ ఖాన్ ఫ్యూచర్లో చెబుతాడని ఆర్జీవి పందెం కూడా కాషారు.

ι

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube