ఏపీ ప్రభుత్వంపై రామ్ గోపాల్ వర్మ సెటైర్.. కట్టప్పను ఎవరు చంపారంటూ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మధ్య టికెట్ల వ్యవహారం పై యుద్ధం కొనసాగుతూనే ఉంది.ఈ క్రమంలోనే టిక్కెట్ల రేట్లపై వర్మ గత కొన్ని రోజుల నుంచి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు.

 Ram Gopal Varma Satire On Ap Government Who Killed Kattappa Rgv,  Tollywood,  Di-TeluguStop.com

ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని, వర్మ మధ్య ట్వీట్ల యుద్ధం జరిగిందని చెప్పాలి.ఇక ఈ వివాదానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో మంత్రి పేర్ని నాని వర్మకు అపాయింట్మెంట్ ఇచ్చి అతనితో కలిసి సంప్రదింపులు చేశారు.

వర్మ మంత్రి భేటీ అనంతరం ఈ వివాదాన్ని ఇంతటితో పులిస్టాప్ పడుతుందని అందరూ భావించారు.అలా అందరూ భావించిన విధంగా సైలెంట్ అయితే వర్మ స్పెషాలిటీ ఏముంటుంది చెప్పండి.

ఎవరు ఊహించని విధంగా మరో సారి వర్మ టికెట్ల వ్యవహారం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై సెటైర్లు వేశారు.ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ కట్టప్పను ఎవరు చంపారు? అంటూ మరోసారి మొదలుపెట్టారు.

Telugu Ap, Ap Ticket Rates, Perni Nani, Tollywood, Ys Jagan-Movie

ఇలా కట్టప్పని ఎవరు చంపారు అంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై ఇండైరెక్ట్ గా సెటైర్లు వేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాకు ఉత్తరాది రాష్ట్రాలలో సుమారు 2200/- టికెట్ ధరలు ఉంటే సొంత రాష్ట్రమైన ఏపీలో మాత్రం 200 రూపాయలకు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో మరోసారి ఈ విషయంపై వర్మ స్పందిస్తూ కామెంట్ చేశారు.ఈ క్రమంలోనే వర్మ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube