అమ్మ బాబోయ్ :  ఈ రోజు నా బర్త్ డే కాదు... డెత్ డే అంటున్న రామ్ గోపాల్ వర్మ

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచేటువంటి టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు “రామ్ గోపాల్ వర్మ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే రామ్ గోపాల్ వర్మ ఎలాంటి విషయాన్నైనా సుత్తి లేకుండా ముక్కు సూటిగా మాట్లాడుతూ తనకు నచ్చినట్లు జీవిస్తుంటాడు.

 Ram Gopal Varma Said Today He Is Death Day-TeluguStop.com

అంతేగాక ఎప్పుడూ విభిన్న కథనాలు ఎంచుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో ముందుంటాడు.కాగా ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ ఇంతకుమునుపుటిలా తన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాడు.

దీంతో తన చిత్రాలతోకన్నా ఎక్కువగా వివాదాలతోనే బాగా పాపులర్ అవుతున్నాడు.

 Ram Gopal Varma Said Today He Is Death Day-అమ్మ బాబోయ్ :  ఈ రోజు నా బర్త్ డే కాదు… డెత్ డే అంటున్న రామ్ గోపాల్ వర్మ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా చేసినటువంటి ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఇంతకీ ఆ ట్వీట్ ఏమిటంటే ఈ రోజు రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు కావడంతో తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయంపై స్పందిస్తూ “ఈ రోజు నా పుట్టిన రోజు కాదు…  డెత్ డే” అని ఎందుకంటే తన జీవితంలో  మరో సంవత్సరం ముగిసిపోయిందని పేర్కొన్నాడు.దీంతో ఈ ట్వీట్ ని కొంతమంది నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

అంతేకాకుండా మీమ్ క్రియేటర్స్ కూడా “జీవితం పై ఇదెక్కడి మాస్ క్లారిటీ రామ్ గోపాల్ వర్మ మావా” అంటూ బ్రహ్మానందం ఫోటో ని జోడించి తెగ వైరల్ చేస్తున్నారు.అలాగే కొందరు సినీ సెలబ్రిటీలు, అభిమానులు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా రామ్ గోపాల్ వర్మ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అయితే 1989వ సంవత్సరంలో అక్కినేని హీరో నాగార్జున హీరోగా నటించిన శివ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పని చేశాడు అయితే ఈ చిత్రం అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త ట్రెండ్ ని సృష్టించింది.అంతేకాకుండా ఈ చిత్రంలో నాగార్జున సైకిల్ చైన్ ఫైట్ ఇప్పటికీ సినీ ప్రేక్షకులకి బాగానే గుర్తుంటుంది.

కాగా ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించినందుకు రామ్ గోపాల్ వర్మ కి నంది అవార్డు కూడా దక్కింది.కాగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ తెలుగులో “ఎంటర్ ది గర్ల్ డ్రాగన్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి.

దీంతో తాజాగా రామ్ గోపాల్ వర్మ తాను దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రం “డి కంపెనీ”  చిత్ర షూటింగ్ పనులను గోవా పరిసర ప్రాంతాల్లో మొదలుపెట్టినట్లు సమాచారం.

ఈ చిత్రాన్ని అండర్ వరల్డ్ మాఫియా డాన్ “దావూద్ ఇబ్రహీం” జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు గతంలో ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ తెలిపాడు.దీంతో ఈ చిత్రంపై బాగానే అంచనాలు నెలకొన్నాయి.

#Ram Gopal Varma #RamGopal #RamGopal #RamGopal #RamGopal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు