చాలా హాట్ గా ప్రమోట్ చేస్తున్న ఆర్జీవీ....

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏదో వివాదంతో సావాసం చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ వాస్తవిక సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.

 Ram Gopal Varma Promoting With Very Spicy To The Dangerous Movie-TeluguStop.com

కానీ ఇంతకు మునుపటిలా మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాడు.అయితే తన చిత్రాల్లో కంటెంట్ పెద్దగా లేకపోయినప్పటికీ ప్రమోషన్స్ తో కలెక్షన్లను తెప్పించగల సమర్ధుడు రామ్ గోపాల్ వర్మ.

కాగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ తెలుగులో “డేంజరస్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రంలో బ్యూటిఫుల్ హీరోయిన్ అప్సర రాణి మరియు నైనా గంగూలీ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు రామ్ గోపాల్ వర్మ సన్నాహాలు చేస్తున్నాడు.దీంతో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అప్సర రాణి మరియు నైనా గంగూలీల బికినీ ఫోటోలను మరియు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ బాగానే సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రమోట్ చేస్తున్నాడు.

Telugu Apsara Rani, Naina Ganguly, Ram Gopal Varma, Ramgopal, Tollywood-Movie

కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ సాంగ్ విడుదల గురించి తెలియజేస్తూ బీచ్ లో బికినీ దుస్తులు ధరించిన హీరోయిన్ల ఫోటోలు షేర్ చేశాడు.దీంతో కొంత మంది నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ  తన చిత్రాల్లో కంటెంట్ లేకపోయినప్పటికీ హాట్ ఫోటోలతో బాగానే ప్రమోట్ చేస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా రామ్ గోపాల్ వర్మ ఇటీవలే దర్శకత్వం వహించిన “డి కంపెనీ” వెబ్ సిరీస్ ను నూతన ఓటీటీ స్పార్క్ పోటీలో విడుదల చేశాడు.కాగా ప్రస్తుతం ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube