పవర్ స్టార్ కథపై వర్మ క్లారిటీ

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్‌డౌన్ సమయాన్ని పూర్తిగా వినియెగించుకుంటున్నాడు.అందరూ ఇళ్లకే పరిమితం అయ్యి లాక్‌డౌన్‌ను గడిపేస్తుంటే, వర్మ మాత్రం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

 Ram Gopal Varma Reveals Power Star Story Line, Ram Gopal Varma, Power Star, Pawa-TeluguStop.com

ఇప్పటికే మియా మాల్కోవాతో క్లైమాక్స్ అనే సినిమాను తెరకెక్కించి రిలీజ్ చేసిన వర్మ, ఇటీవల నగ్నం అనే సినిమాను కూడా రిలీజ్ చేశాడు.ఈ రెండు సినిమాలను ఓటీటీ ప్రేక్షకులు బాగా ఆదరించడంతో తన నెక్ట్స్ చిత్రం ‘పవర్ స్టార్’ను రీసెంట్‌గా అనౌన్స్ చేశాడు.

కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవితాన్ని ఈ సినిమా ద్వారా చూపించేందుకు వర్మ రెడీ అవుతున్నాడు.అయితే పవన్ జీవితాన్ని వక్రీకరించేందుకే వర్మ ఇలాంటి సినిమా తీస్తున్నాడని పవన్ ఫ్యాన్స్ ఆయనపై మండి పడుతున్నారు.

కాగా ఈ విషయంపై ఆయన్ను తెగ ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా పవర్ స్టార్ చిత్రంపై వర్మ కొంత క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమాలో ఓ స్టార్ హీరో రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పరాజయం పాలు కావడంతో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో ఈ సినిమాలో చూపించనున్నట్లు వర్మ చెప్పాడు.

ఈ సినిమా ఎవరికీ సంబంధించినది కాదని, ఎవరినైనా పోలీ ఉంటే అది పూర్తిగా యాదృచికం అనే విషయాన్ని వర్మ మరోసారి తెలిపాడు.

మరి ఈ క్లారిటీ పై పవన్ ఫ్యాన్స్ వర్మకు ఎలాంటి కౌంటర్ వేస్తారో చూడాలి.ఏదేమైనా వర్మ తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కిస్తూ రిలీజ్ కూడా చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube