వర్మ, పవన్.. మధ్యలో చరణ్!  

Ram Charan Satirical Tweet On RGV Pawan Issue, Ram Charan, Ram Gopal Varma, Pawan Kalyan, Power Star - Telugu Pawan Kalyan, Power Star, Ram Charan, Ram Gopal Varma

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పవర్ స్టార్’ ఎలాంటి వివాదాన్ని క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడంటూ పవన్ అభిమానులు వర్మపై మండి పడుతున్నారు.

 Ram Charan Ram Gopal Varma Pawan Kalyan Power Star

కాగా నిన్న ఆయన ఆఫీసుపై పవన్ అభిమానులు దాడి కూడా చేశారు.అయినా తానెవ్వరికీ భయపడనంటూ వర్మ తేల్చి చెప్పడంతో ఈ వివాదం ఎటు వెళ్తుందా అని అందరూ అనుకుంటున్నారు.

అయితే గతకొద్ది రోజులుగా ఈ వివాదం గురించి మీడియాలో అదేపనిగా వార్తలు వస్తుండటంతో ప్రేక్షకులకు చిరాకు లేస్తోంది.కాగా ఇదే విషయాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తనదైన స్టయిల్‌లో వ్యక్త పరిచాడు.

వర్మ, పవన్.. మధ్యలో చరణ్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తాజాగా సోషల్ మీడియాలో రంగస్థలం చిత్రంలోని ఓ ఫోటోను షేర్ చేస్తూ ‘కేవలం పనికొచ్చే వార్తలే వింటున్నా’ అంటూ పోస్ట్ పెట్టాడు.అనవసరమైన విషయాలను తాను పట్టించుకోనని, అలాంటి వాటికి తాను స్పందించనని చరణ్ ఈ పోస్ట్ ద్వారా తెలిపాడు.

మొత్తానికి వర్మ-పవన్ వివాదంలో మెగా ఫ్యామిలీ నుండి ఎవరూ స్పందించక పోవడంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.ఇటీవల మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వర్మపై ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.

పవర్‌స్టార్ చిత్రాన్ని రిలీజ్ చేయకూడదని పవన్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నా వర్మ మాత్రం ఈ విషయంపై వెనక్కి తగ్గకపోవడంతో ఈ వివాదం ఎటు వెళ్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.మరి చరణ్ పోస్ట్‌కు వర్మ ఎలాంటి కామెంట్ వేస్తాడో చూడాలి.

View this post on Instagram

Listening to Credible info ONLY!!

A post shared by Ram Charan (@alwaysramcharan) on

#Pawan Kalyan #Power Star #Ram Gopal Varma #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Charan Ram Gopal Varma Pawan Kalyan Power Star Related Telugu News,Photos/Pics,Images..