రియాకు ఫుల్‌ సపోర్ట్‌ చేస్తున్న వర్మ

సుశాంత్‌ మృతి విషయంలో చాలా మంది రియా చక్రవర్తిని టార్గెట్‌ చేస్తున్నారు.ఇండస్ట్రీలో కూడా చాలా మంది రియాను వ్యతిరేకిస్తున్నారు.

 Ram Gopal Varma One More Twit About Rhea Chakraborty, Rgv, Rhea Chakravarthy, Su-TeluguStop.com

ఇలాంటి సమయంలో వర్మ మాత్రం ఆమెకు ఫుల్‌ సపోర్ట్‌ ఇచ్చాడు.వర్మ ఈమద్య వరుసగా రియా గురించి ట్వీట్స్‌ చేస్తున్నాడు.

రియా విషయంలో అంతా నెగటివ్‌ గా ఆలోచిస్తున్నారు.ఎందుకు పాజిటివ్‌ గా ఆలోచించడం లేదు అంటూ ఆమె వైపుగా మాట్లాడిన వర్మ ఇప్పుడు మరో ట్వీట్‌ ను చేశాడు.

నేడు రియా ఇంటర్వ్యూ వైరల్‌ అయ్యింది.దాంతో ఆమెకు కొంత మద్దతు పెరిగింది.

ట్విట్టర్‌ లో జస్టీస్‌ ఫర్‌ రియా అనే హ్యాష్‌ ట్యాగ్‌ ఇండియా వైడ్‌ గా ట్రెండ్‌ అయ్యింది.దాన్ని స్ర్కీన్‌ షాట్‌ తీసి ట్వీట్‌ చేశాడు.చివరకు కొందరు అయినా ఆమె పక్షాణ నిలుస్తున్నారు అంటూ పేర్కొన్నాడు.ఆమె ఇంటర్వ్యూతో చాలా మంది కళ్లు తెరుచుకున్నాయి.

సుశాంత్‌ విషయంలో కొందరికి ఉన్న అనుమానాలు, రియాపై కొందరికి ఉన్న అనుమానాలను ఆ ఇంటర్వ్యూ తీర్చింది అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.వర్మ ఆమె పట్ల అంత పాజిటివ్‌ గా ఉండటంను కొందరు వ్యతిరేకిస్తున్నారు.

వర్మ ఎప్పుడైనా నలుగురు ఒక దారి అయితే ఈయనది మరో దారి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube