'జగమొండి' అంటూ.. మరొక కాంట్రవర్సీ కథతో రాబోతున్న ఆర్జీవీ..!

వివాదాస్పద దర్శకుడిగా పేరుతెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరొకరి మీద కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన దెయ్యం సినిమా ఏప్రిల్ 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 Ram Gopal Varma New Movie Jagamondi-TeluguStop.com

ఇందులో రాజేశేఖర్, స్వాతి దీక్షిత్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఇంతకు ముందు ఆర్జీవీ ఇదే సినిమాను జేడీ చక్రవర్తి, మహేశ్వరీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఇప్పుడు మళ్ళీ అదే పేరుతో సినిమా తీసాడు.ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.ఇది ఇలా ఉండగా ఈ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మ మరొక కాంట్రవర్సీ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలుస్తుంది.ఈ మధ్య ఈయన తెరకెక్కించే సినిమా లన్నీ వివాదాస్పదంగానే ఉంటున్నాయి.

 Ram Gopal Varma New Movie Jagamondi-జగమొండి’ అంటూ.. మరొక కాంట్రవర్సీ కథతో రాబోతున్న ఆర్జీవీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మళ్ళీ ఇప్పుడు అదే అంశాన్ని ఎంచుకున్నాడని తెలుస్తుంది.

గతంలో ఈయన తీసిన వంగవీటి, ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి సినిమాలు ఆంధ్ర రాజకీయాలను వేడెక్కించాయి.మళ్ళీ ఇప్పుడు రాజకీయాలను వేడెక్కించడానికి రెడీ అవుతున్నాడని సమాచారం.‘జగమొండి’ పేరుతో మళ్ళీ ఒక సినిమా చేయబోతున్నాడట.అది కూడా ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద తీస్తున్నాడని సమాచారం.దీనికి నిర్మాతగా కడప జిల్లాకు చెందిన ఒక నాయకుడి కుమారుడు వ్యవహరిస్తున్నాడని తెలుస్తుంది.

ఈయన ఇప్పటికే రామ్ గోపాల్ వర్మతో ఒక సినిమా తీస్తున్నాడట.ఇప్పుడు ఈ సినిమా కూడా ఆయనే నిర్మించబోతున్నాడని టాక్.

ఈ సినిమాలో జగన్ మొండితనాన్ని చూపించనున్నారని.తన పదవి కోసం కాంగ్రెస్ నుండి బయటకు రావడం.

కొత్త పార్టీ పెట్టడం.ఆ తర్వాత ఆయన ఎదుర్కొన్న పరిణామా లను సినిమాగా తీయ బోతున్నాడట ఆర్జీవీ.

మరి చూడాలి ఈ సినిమాతో మళ్ళీ ఎంత వివాదం చెలరేగుతుందో.

#Jagamondi #RamGopal #Ram Gopal Varma #AP Cm

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు