'డి కంపెనీ' టాక్‌ః మళ్లీ అనుకున్నదే అయ్యింది

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఇటీవల కాలంలో వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.అయినా కూడా ఆయన సినిమా లు అంటే కాస్త ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఉంటుంది.

 Ram Gopal Varma New Film D Company Public Talk-TeluguStop.com

ఆయన ప్రతి సినిమా విడుదల సమయంలో ప్లాప్‌ అవుతుందనే అంతా అనుకుంటూ ఉంటారు.కాని ఒకసారి చూద్దాం అన్నట్లుగా మాత్రం భావిస్తూ ఉంటారు.

అందుకే డి కంపెనీ సినిమా పై కూడా మొదట అందరికి అంచనాలు ఆసక్తి పెరిగింది.కాని తీరా చూస్తే సినిమా ఎప్పటి లాగే వర్మ పాత సినిమాల మాదిరిగా కాకుండా ఇటీవల ఆయన చేసిన సినిమాల మాదిరిగా నిరాశ పర్చింది అంటూ టాక్ వినిపిస్తుంది.

 Ram Gopal Varma New Film D Company Public Talk-డి కంపెనీ’ టాక్‌: మళ్లీ అనుకున్నదే అయ్యింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా తో వర్మ మళ్లీ అదే తీరు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

వర్మ డీ కంపెనీ సినిమా ను స్పార్క్ కొత్త ఓటీటీ ద్వారా విడుదల చేశారు.

ఇప్పటికే తెలుగులో ఆహా ఓటీటీ ఉంది.ఇలాంటి సమయంలో స్పార్క్ అంటూ కొత్తగా ఓటీటీ రావడం జరిగింది.

వర్మ ఓటీటీ అవ్వడం వల్ల ఆయన ఇటీవల కాలంలో చేసిన కళా ఖండాలు అన్ని కూడా అందులో ఉన్నాయి.పవన్ పై ఆయన చేసిన సినిమా నుండి మొదలుకుని ఆమద్య జరిగిన రేప్‌ సంఘటనపై తీసిన దిశ ఎన్‌ కౌంటర్ వరకు అన్ని కూడా స్పార్క్ లో ఉన్నాయి.

వర్మ సినిమా లతో పాటు పలు పాత సినిమాలు కూడా ఉన్నాయి.స్పార్క్‌ ఖాతా ను డబ్బు పెట్టి తీసుకున్నందుకు డి కంపెనీ తీవ్రంగా నిరాశ పర్చింది.

అసలు ఇలాంటి సినిమాలు ఎందుకు వస్తున్నాయో మాకు అర్థవం కావడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి.ఈ సమయంలో వర్మ సినిమా లకు సంబంధించి మళ్లీ అవే విమర్శలు పెదవి విరుపులు కనిపిస్తున్నాయి.

#Ram Gopal Varma #DCompany #Grv Ott #Spark #Spark Ott Movie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు