వర్మ ‘థ్రిల్లర్‌’ పై పెదవి విరుస్తున్నారు  

RGV, Thriller Movie, Camera Angles, Murder, Audience Not showing interest on varma Thriller movie - Telugu Audience Not Showing Interest On Varma Thriller Movie, Camera Angles, Murder, Rgv, Thriller Movie

రామ్‌ గోపాల్‌ వర్మకు డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా అయ్యింది.వారంకు ఒక సినిమాను తీసి విడుదల చేస్తున్నాడు.

 Ram Gopal Varma New Film

ఈయన చేస్తున్న సినిమాలు సోషల్‌ మీడియాలో రెండు మూడు రోజులు హడావుడి చేసి వెళ్తున్నాడు.ఇప్పటికే క్లైమాక్స్‌.

నగ్నం.పవర్‌ స్టార్‌ ఇలా కొన్ని సినిమాలను తీసుకు వచ్చాడు.

వర్మ ‘థ్రిల్లర్‌’ పై పెదవి విరుస్తున్నారు-Movie-Telugu Tollywood Photo Image

ఇప్పుడు మర్డర్‌ మరియు థ్రిల్లర్‌ సినిమాను తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సమయంలో థ్రిల్లర్‌ సినిమాను ప్రమోట్‌ చేస్తున్నాడు.

తాజాగా వర్మ థ్రిల్లర్‌ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.నగ్నం సినిమాలో ఎలా అయితే బూతు చూపించాడో ఇప్పుడు అలాగే ఈ సినిమాలో కూడా పచ్చి బూతు చూపిస్తున్నాడు.

కెమెరా యాంగిల్స్‌ను తప్ప మరే దానిపై దృష్టి పెట్టలేదు.అప్సర రాణి ఇందులో కీలక పాత్రలో కనిపించబోతుంది.ఈమెపై వర్మ పెట్టిన కెమెరా యాంగిల్స్‌ మరీ రచ్చగా ఉన్నాయి.ఈ అమ్మడిని వర్మ చూపించిన తీరు కొందరికి ఎగటు పుట్టించే విధంగా ఉంది.
వర్మ గతంలో తీసిన ఎన్నో సినిమాల మాదిరిగానే ఇందులో కూడా ఏమీ లేదని తేలిపోయింది.అందుకే ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు.బూతు సినిమా కంటెంట్‌ ఇప్పటికే వెగటు పుట్టింది.ఇక ఈ సినిమాతో మళ్లీ ఏం చెప్పాలనుకుంటున్నాడు వర్మ అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈ చిత్రానికి బుకింగ్స్‌ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.అయిదు లక్షలు కూడా రాకపోవచ్చు అంటున్నారు.

అయితే వర్మ అంత కూడా ఖర్చు పెట్టి ఉండడు కనుక నష్టం ఏమీ లేదు.

#Camera Angles #Murder #RGV

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Gopal Varma New Film Related Telugu News,Photos/Pics,Images..