మర్డర్ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసిన వర్మ

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తాడు.ఇప్పటికే కరోనా పేరుతో ఓ సినిమాను రిలీజ్‌కు రెడీ చేసిన వర్మ, యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘మర్డర్’ చిత్రాన్ని కూడా రిలీజ్‌కు రెడీ చేశాడు.

 Ram Gopal Varma Murder Movie Release Date Fixed, Ram Gopal Varma, Murder, Amruth-TeluguStop.com

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్యను ఆధారంగా చేసుకుని వర్మ ఈ సినిమాను తెరకెక్కించాడు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.

అయితే ఈ సినిమాను వేసవిలో మొదలుపెట్టిన వర్మ, అప్పుడే ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూశాడు.కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అయ్యింది.

ఇక ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.కానీ ఈ సినిమాను నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని వర్మ పలుమార్లు చెబుతూ వచ్చాడు.

ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించి వర్మ క్లారిటీ ఇచ్చాడు.ఈ సినిమాను నేరుగా థియేటర్లలో డిసెంబర్ 18న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమా సెన్సార్ పనులను కూడా ముగించేసుకుందని, సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారని వర్మ చెప్పుకొచ్చాడు.

మొత్తానికి వర్మ తెరకెక్కిస్తున్న మర్డర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అవ్వడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాను ఆనంద్ చంద్ర డైరెక్ట్ చేయగా, నట్టి క్రాంతి, నట్టి కరుణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.మరి తెలంగాణలో సంచలనం సృష్టించిన అమృత-ప్రణయ్‌ల కేసును వర్మ ఎలా చూపించబోతున్నాడో తెలియాలంటే మర్డర్ చిత్రం రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

కాగా ఈ సినిమా రిలీజ్‌ను నిలిపివేయాలంటూ ప్రణయ్ తండ్రి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube