బోల్డ్ గా ప్రమోషన్స్ చేస్తున్న ఆర్జీవీ... కానీ నెటిజన్లు మాత్రం....  

తెలుగులో ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రాలకి ఉన్నటువంటి క్రేజ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అయితే ఒకప్పుడు టాలీవుడ్ కింగ్ నాగార్జున తో తెరకెక్కించిన శివ అనే చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులను ఇప్పటికీ బాగానే ఆకట్టుకుంటోంది.

TeluguStop.com - Ram Gopal Varma Movie Ladki Tu Nahi Song News

 ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ కొంతమేర స్టొరీ కి తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈ క్రమంలో కొంతమేర హీరో హీరోయిన్లను బోల్డ్ గా చూపిస్తూ ప్రమోషన్ చేస్తున్నాడు.

కాగా ప్రస్తుతంరామ్ గోపాల్ వర్మ “లడకి” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ “పూజ బాలేకర్” నటిస్తుండగా ప్రతీక్ పార్కర్, శివమ్ మల్హోత్రా తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

TeluguStop.com - బోల్డ్ గా ప్రమోషన్స్ చేస్తున్న ఆర్జీవీ… కానీ నెటిజన్లు మాత్రం….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన “తు నహి” అనే పాటని చిత్ర యూనిట్ సభ్యులు యూట్యూబ్ లో విడుదల చేశారు. అయితే ఈ పాటను విడుదల చేసిన ఒక్క రోజులోనే లక్షా ఆరు వేల పైచిలుకు వ్యూస్ వచ్చాయి.

దీంతో కొందరు నెటిజన్లు ఈ వీడియో సాంగ్ పై స్పందిస్తూ వీడియో సాంగ్ లో హీరోయిన్ ని బోల్డ్ గా చూపించడం తప్ప ఎలాంటి ఆసక్తకర  అంశాలు కనబడడం లేదని కామెంట్లు చేస్తున్నారు.మరికొందరైతే రానురాను రామ్ గోపాల్ వర్మ ఇలాంటి బోల్డ్ పాటలు, హీరోయిన్ల ఫోటోలతో ప్రమోషన్స్ చేసుకుంటున్నాడని కొంతమేర ఎద్దేవా చేస్తున్నారు.

 అయినప్పటికీ రామ్ గోపాల్ వర్మ మాత్రం ఇలాంటి కామెంట్లు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

కాగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడినప్పటికీ రామ్ గోపాల్ వర్మ మాత్రం తన చిత్రాలని ఆన్ లైన్ ద్వారా విడుదల చేస్తూ బాగానే సొమ్ము చేసుకున్నాడు.

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్నటువంటి “దిశ ఎన్కౌంటర్” అనే చిత్రాన్ని కోర్టు వారు విడుదల చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు.అంతేగాక ఆ మధ్య మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఓ పరువు హత్య ఆధారంగా తెరకెక్కిన మర్డర్ అనే చిత్రాన్ని కూడా విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేసింది.

#RamGopal #RamGopal #BoldPooja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Gopal Varma Movie Ladki Tu Nahi Song News Related Telugu News,Photos/Pics,Images..