హడావుడి లేకుండా వచ్చిన 'కొండా'.. వర్మ మార్క్‌ లేదేం?

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన కొండా సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తెలంగాణ లోని వరంగల్ జిల్లా కు చెందిన కొండా మురళి మరియు కొండ సురేఖ ల జీవితం ఆధారంగా ఈ సినిమా ను రూపొందించారు.

 Ram Gopal Varma Konda Movie Publicity Not Full Active Details, Konda Movie, Kond-TeluguStop.com

కొండా మురళి విద్యార్థి జీవితం లో ఎలా ఉండేవాడు.ఆయన నక్సల్స్ ఉద్యమంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది.

కొండా మురళి మరియు కొండా సురేఖలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రాముఖ్యత ఉంది.వైఎస్సార్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో కొండా సురేఖ కు చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాడు.

అందుకే ఆయన చనిపోయిన సమయంలో జగన్‌ వెంట కొండా దంపతులు నడిచారు.ఆ తర్వాత వారి రాజకీయ జీవితం అటు ఇటు సాగి ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లో ఉంది.

దాంతో రామ్ గోపాల్‌ వర్మ కొండా సినిమా తీస్తున్నాడు అన్నప్పుడు అంతా కూడా ఏం చూపిస్తాడు అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.నేడు సినిమా విడుదల అయ్యింది.

అంతా ఊహించినట్లుగానే కొండా ను హీరోగానే వర్మ చూపించాడు.కొందరికి అది నచ్చడం లేదు.

సినిమా విడుదలకు ముందు వర్మ ఎప్పుడైనా హడావుడి చేస్తూ ఉంటాడు.కాని ఈ సినిమా విడుదల విషయంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ సమయంలో తప్ప ఎక్కువగా హడావుడి కనిపించలేదు.

Telugu Ram Gopal Varma, Konda, Konda Murali, Konda Review, Konda Surekha, Rgv Ko

అధికార పార్టీ ఒకరు ఈ సినిమా ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెట్టడం ద్వారా పాపులారిటీ మరియు సినిమాకు పబ్లిసిటీ దక్కుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.కాని వర్మ అదే ప్రయత్నించలేదు.సాదారణంగానే తన మార్క్ లేకుండానే సినిమాను విడుదల చేశాడు.అధికార పార్టీ ఈ సినిమా విడుదలను ఎక్కడ అడ్డుకుంటుందో అనే ఉద్దేశ్యంతో సినిమాను వివాదాస్పదం చేయలేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube