బాబు ఓటమిలో వర్మ పోషించిన పాత్ర ఎంత?  

Ram Gopal Varma Key Role In Andhra Pradesh Assembly Elections-assembly Elections,chandrababu,jagan Ysrcp,karna,ram Gopal Varma,బాబు,రామ్‌ గోపాల్‌ వర్మ

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. జగన్‌ పడ్డ కష్టంకు, చంద్రబాబు నాయుడుపై ఉన్న వ్యతిరేకతతో పాటు, అనేక కారణాలు చంద్రబాబు నాయుడు ఓటమికి కారణం అంటున్నారు. అనేక కారణాల్లో రామ్‌ గోపాల్‌ వర్మ ఒక కారణంగా చాలా మంది అంటున్నారు..

బాబు ఓటమిలో వర్మ పోషించిన పాత్ర ఎంత?-Ram Gopal Varma Key Role In Andhra Pradesh Assembly Elections

ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడును విలన్‌గా చూపిస్తూ వర్మ తీసిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం చాలా ప్రభావం చూపిందని రాజకీయ వర్గాల వారు అంటున్నారు.

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా రామ్‌గోపాల్‌ వర్మ విడుదల చేసిన పాత వీడియోలు, మరి కొన్ని పోస్టర్‌లు రాజకీయాలపై చాలా ప్రభావం చూపిందనడంలో ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా రామ్‌ గోపాల్‌ వర్మ వల్ల కొంతలో కొంత అయినా చంద్రబాబు నాయుడుకు నష్టం జరిగిందనే టాక్‌ వస్తుంది. ఇదే సమయంలో జగన్‌కు వర్మ చేసిన సపోర్ట్‌ కూడా ఆయన విజయంలో కీలక పాత్ర పోషించింది.

రామ్‌ గోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం ఏ స్థాయిలో హడావుడి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణలో విడుదలైన ఆ చిత్రం ఆంధ్రాలో ఇంకా కూడా విడుదల కాలేదు. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు తన సినిమాను విడుదల కాకుండా చేశాడు అంటూ పదే పదే విమర్శలు చేసిన వర్మ ఇప్పుడు జగన్‌ సీఎం అయిన తర్వాత అంటే మే 31న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.